తెలుగు చలన చిత్ర పరిశ్రమంలో ఫైట్స్, డ్యాన్స్ కి కొత్త వన్నె తీసుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ.  అప్పట్లో ఫైట్స్ అంటే మల్లయుద్దాల తరహా ఉండేవి.. కానీ సూపర్ స్టార్ కృష్ట ఆ ట్రెండ్ పూర్తిగా మార్చారు.  డిటెక్టీవ్ తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.  కౌబాయ్ సినిమాల రుచి ఏంటో తెలుగు ప్రేక్షకులకు చూపించారు.. ఇలా ఎన్నో రకాలుగా పాశ్చత్య చిత్రాలకు తామేమీ తక్కువ కాకుండా కొత్త కొత్త ట్రెండ్ ఫాలో అయ్యారు.  ఆయన నటించిన  సినిమాలు ఎన్నో బాలీవుడ్ లో అనువదింపబడ్డాయి.. మోసగాళ్లకు మోసగాడు సినిమా ఏకంగా హాలీవుడ్ లో అనువదింపబడింది.  సూపర్ స్టార్ జీవితంతో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి.. కష్టాలు ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ సాహసాలకు పెట్టింది పేరు.

 

55 ఏళ్ల సుదీర్ఘ చలనచిత్ర జీవిత ప్రస్థానంలో తెలుగు చిత్ర పరిశ్రమకే కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవల విలువను ఎవరూ మర్చిపోలేరు. 1965 – మార్చి 31న విడుదలైన "తేనె మనసులు" చిత్రంతో వెండితెరపై పరిచయమైన కృష్ణ అతి తక్కువ కాలంలోనే తెలుగువారికి అత్యంత సన్నిహితమయ్యారు. 1965 లో తేనె మనసులు, కన్నె మనసులు, 1966 లో గూడచారి 116 ఇలా రెండేళ్లలో 3 చిత్రాలకు మాత్రమే పరిమితమైయ్యారు. కృష్ణ 1967 నుంచి ఉత్తుంగ తరంగంలా విజృంభించారు.

 

1967లో కృష్ణ నటించిన ఏడు చిత్రాలు విడుదల కాగా 1968 లో 11, 1969 - 70 సంవత్సరాలలో 15 చిత్రాల చొప్పున చెందారు.  అప్పటి కాలేజీ యూత్, పెద్దలు అందరికీ బాల్య స్మృతులుగా, గొప్ప జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. కృష్ణ సినిమాలు, పాటలు, సాహసాలు. ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏ హీరో, అందనంత ఉత్పాదకతను తెలుగు చిత్ర పరిశ్రమకు కృష్ణ అందించారు. పగలు రేయికి తేడా లేకుండా రోజుకు మూడు నాలుగు షిఫ్ట్ ల చొప్పున పనిచేసి నమ్ముకున్న నిర్మాతలకు లాభాల పంట పండించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: