టాలీవుడ్ నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటగా చిన్నతనంలోనే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంతో సినిమాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని ఆపై 1999లో కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్, తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక అక్కడి నుండి ఒక్కో సినిమాతో హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగిన మహేష్ కెరీర్ లో ఏడవ సినిమాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి 2006లో రిలీజ్ అయి ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా అందుకున్న విజయం తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ గా గొప్ప పేరు, క్రేజ్, మార్కెట్ సంపాదించిన మహేష్, ఆ తరువాత నుండి తనకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో పోకిరి వంటి గొప్ప విజయవంతమైన సినిమాని ఇచ్చిన పూరి కూడా ఒకరు అని తరచూ పలు చెప్తూ ఉంటారు. 

 

ఇక ఆ తరువాత వారిద్దరి కాంబోలో మరొక సినిమా అయిన బిజినెస్ మ్యాన్ రూపొంది అది కూడా సూపర్ హిట్ కొట్టడం జరిగింది. ఆ విధంగా మహేష్, పూరి ఇద్దరి కాంబోలో వచ్చిన ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ కొట్టడం జరిగింది. అయితే ఆపై వారిద్దరూ మరొక సినిమా చేస్తారని అందరూ భావించినప్పటికీ అది ఇప్పటివరకు సాధ్యం కాలేదు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పూరి మాట్లాడుతూ, దర్శకుడిగా తనకు గడ్డు కాలం నడుస్తున్న సమయంలో మహేష్ సహా పెద్ద హీరోలు ఎవరూ కూడా తన నుండి కథలు వినలేదు సరికదా సినిమా చేయడానికి కూడా సుముఖత చూపలేదంటూ అప్పట్లో సంచలన కామెంట్స్ చేసారు పూరి. 

 

అయితే దానిపై ఇప్పటివరకు మహేష్ మాత్రం నోరు విప్పలేదు. ఇకపోతే నేడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో చాట్ సెషన్ లో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ ని ఒక అబిమాని ప్రశ్నిస్తూ, మీరు పూరి గారితో చేసిన రెండు సినిమాలు ఎంతో మంచి హిట్ కొట్టాయి, మీరిద్దరూ కలిసి ,మరొక సినిమా చేస్తే చూడాలని ఉంది సర్ అంటూ ప్రశ్నించగా, తప్పకుండా వీలైనంత త్వరలో పూరి గారితో నేను మరొక సినిమా చేస్తాను, నాకు ఎంతో ఇష్టమైన దర్శకుల్లో పూరి కూడా ఒకరు అంటూ ఏ మాత్రం భేషిజం లేకుండా మహేష్ ఇచ్చిన సమాధానానికి పలువురు ఫ్యాన్స్, ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. తనపై నెగటివ్ కామెంట్స్ చేసిన పూరి పై కూడా పాజిటివ్ గా మాట్లాడే మహేష్ నిజంగా గ్రేట్ ని, మహేష్ పై నెగటివిటి ప్రచారం చేసేవారికి ఆయన చెప్పిన ఈ సమాధానం వింటే దిమ్మతిరిగడం ఖాయం అంటూ కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: