తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం " సర్కారు వారి పాట ". నేడు సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి  ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనితో మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా కంటే ముందు మహేష్ నటించిన మూడు సినిమాలతో ఒక దానికి మించిన వరకు బ్లాస్టర్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

 

ఇదే ఇదే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకున్నాడు. అంతే కాకుండా ఇప్పుడు మరో హ్యాట్రిక్ కు సర్కారు వారి పాట సినిమా మొదలు కానుంది అని ఆయన ట్వీట్ చేశాడు. ఇకపోతే ఈ సినిమాలో మొదటి అక్షరాలను గమనించినట్లయితే SSMB అని వస్తున్నాయి. మామూలుగా SSMB అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని అర్థం వస్తుంది.

 

IHG

 

దీనితో మహేష్ అభిమానులు గత సినిమాలతో కలిపి యాదృచ్ఛికంగా మహేష్ పేరు వచ్చిందని సోషల్ మీడియాలో తెగ రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ అంశమే సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంది. ఏది ఏమైనా నేడు సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు తన 27వ సినిమాని ప్రకటించడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఈ విషయం ట్రెండ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: