హీరో మహేష్ బాబు చిన్నతనం నుండి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఆయన నటించిన పలు సినిమా షూటింగ్స్ కి హాజరయ్యేవారు. ఆ తరువాత కొన్నాళ్ళకు బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన మహేష్, అప్పట్లోనే తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించారు. చివరిగా బాలచంద్రుడు సినిమాతో బాలనటుడిగా సినిమాలకు విరామం పలికిన మహేష్, ఆపై చదువు, నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకుని అనంతరం 1999లో రాజకుమారుడు సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 

IHG

ఇక ఆ తరువాత నుండి నటుడిగా ఒక్కో సినిమాతో మంచి నటన, ఆకట్టుకునే అందంతో ఎందరో అభిమానులను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న మహేష్ బాబు, నేడు టాలీవుడ్ అగ్ర కథానాయకులలో ఒకరిగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఇక ఇటీవల కొన్నేళ్ల క్రితం నుండి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అకౌంట్స్ తెరిచిన మహేష్, కొన్నాళ్లుగా వాటి ద్వారా పలువురు ప్రేక్షకులు, అభిమానులతో తన సినిమా, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉన్నారు. ఇకపోతే నేడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసిన మహేష్, అతి త్వరలో లాక్ డౌన్ ముగిసిన అనంతరం ఆ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. 

 

ఇక నేడు కాసేపటి క్రితం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పలువురు ప్రేక్షకులు, అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మహేష్ బాబు, మీకు ఇష్టమైన క్రికెటర్స్ ఎవరూ అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తనకు ఆల్ టై ఫేవరెట్ అయితే సచిన్ టెండూల్కర్ అని, అలానే ప్రస్తుతం ఉన్న ప్లేయర్స్ లో తనకు ఎమ్ఎస్ ధోని, విరాట్ కోహ్లీ అంటే కూడా ఎంతో ఇష్టం అని అన్నారు మహేష్. గతంలో బాలచంద్రుడు సినిమా సమయంలో టాలీవుడ్ లో జరిగిన సినీ తారల క్రికెట్ పోటీల్లో మహేష్ పాల్గొని అత్యధిక రన్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఇటీవల సినిమాలతో బిజీగా ఉన్న తనకు చిన్నప్పటి వలె క్రికెట్ ఆడడం వీలుకాదని కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మహేష్ వెల్లడించారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: