బాలీవుడ్ స్టార్లు ఇప్పటి వరకు నైజాం కలెక్షన్ ఎంత.. గోదావరి నుంచి ఎంతొచ్చింది.. సీడెడ్ వసూళ్లు ఎంత అని లెక్కలేసుకునేవాళ్లు. ఏరియా వైజ్ గా మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నాలు చేసేవాళ్లు. అయితే ఇప్పుడు మార్కెట్ ట్రెండ్స్ తో పాటు ఈ ప్రాంతాల యాసలనీ నేర్చుకుంటున్నారు టాలీవుడ్ స్టార్లు. 

 

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న టాలీవుడ్ మోస్ అవైటెడ్ మూవీ ట్రిపుల్ ఆర్. ఈ హిస్టారికల్ డ్రామాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. తారక్ గోండు వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. తారక్ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ పాత్రల్లో చెర్రీ గోదారి స్లాంగ్ లో మాట్లాడితే.. తారక్ తెలంగాణ యాసలో డైలాగులు చెప్తాడని సమాచారం. 

 

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న పాన్ ఇండియన్ మూవీ పుష్ప. శేషాచలం అడవుల్లో సాగుతోన్న ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది పుష్ప. ఈ సినిమాలో బన్ని, రష్మిక మందన్న ఇద్దరూ చిత్తూరు యాసలో మాట్లాడతారని సమాచారం. అల్లు అర్జున్, రష్మిక ఇద్దరూ ఈ లాక్ డౌన్ లో చిత్తూరు స్లాంగ్ లో పర్ ఫెక్ట్ అయ్యారని తెలుస్తోంది. 

 

వెంకటేశ్ ఫస్ట్ టైమ్ ఫుల్ రగ్గడ్ లుక్ లో నటిస్తోన్న సినిమా నారప్ప. తమిళ హిట్ అసురన్ రీమేక్ గా వస్తోంది ఈ మూవీ. ఈ మాస్ ఎంటర్ టైనర్ ను అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇక సినిమా నేటివిటీకి తగ్గట్టుగా వెంకటేశ్ ఈ మూవీలో సీమ డైలాగులు పేలుస్తాడని చెబుతున్నారు. 

 

ప్రేక్షకులు ఇప్పుడు నేచురల్ గా ఉండే సినిమాలకే కనెక్ట్ అవుతున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఇష్టపడుతున్నారు. అందుకే స్టార్లు కూడా రియలిస్టిక్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. క్యారెక్టర్ కోసం కొత్తకొత్త యాసలు నేర్చుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: