బాలయ్య అంటేనే తన మాటే వేరు. తన రూటే వేరు. ఆయన బాడీ లాగ్వేజ్ఞి పట్టుకుని హిట్లు కొట్టే డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. బాలయ్యలో ఎమోషన్ ఫీలింగ్స్ బాగా పలుకుతాయి. ఆయన ఆగ్రీని వెండితెర నిండా పరిచేయడంతో బోయపాటి దిట్టగానే చెప్పాలి.

 

ఇప్పటికే బాలయ్యతో రెండు సూపర్ డూపర్ హిట్లు తీశారు బోయపాటి. సిం హా మొదలైన ఈ కాంబో లెజెండ్ దాకా సాగింది. ఈ రెండూ బాక్సాఫీస్ ని షేక్ చేయడంతో హ్యాట్రిక్ గ రాబోతున మూవీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

 

ఆ మూవీకి మోనార్క్ అని బోయపాటి టైటిల్ ఫిక్స్ చేశాడని టాక్ నడుస్తోంది. మోనార్క్ అంటే అదిరిపోయే టైటిల్. నిజంగా ఫుల్లుగా పవర్ లోడ్ చేసి పెట్టిన టైటిల్ ఇది. దీన్ని మోయడానికి బాలయ్య రెడీగా ఉన్నారు. బాలయ్య లాంటి హీరోలకు సరిపోయే టైటిల్ ఇది.

 

ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య ఈ మొవీలో రెండు పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందులో ఒకటి అఘోరా అంటున్నారు. ఈ రోల్ వేయడానికి బాలయ్య ఒకే చెప్పడమే విశేషం. ఈ రోల్ సినిమా సెకండ్ హాఫ్ లో వస్తుంది అంటున్నారు.

 

ఇదిలా ఉండగా ఈ మూవీలో ఇద్దరు కొత్త వారిని హీరోయిన్లుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ ముంబై మోడెళ్ళుగా చెబుతున్నారు. ఈ మూవీ టైటిల్ విషయాన్ని మాత్రం బాలయ్య బర్త్ డే అయిన జూన్ 10న ప్రకటిస్తారని చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే బాలయ్య మోనార్క్ టైటిల్ మాత్రం ఫ్యాన్స్ కి పూనకం తెచ్చేలాగ ఉంటుందని అంటున్నారు.

 

ఇక బాలయ్య ఈ సినిమాతో హిట్ ట్రాక్ లోకి వస్తారని కూడా అభిమానులు ఆశపడుతున్నారు. బాలయ్యకు ఈ మధ్యన హిట్లు పెద్దగాలేవు. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన ఎన్టీయార్ మూవీ ఫట్ అనిపించుకుంది. ఆ తరువాత చూసుకుంటే రూలర్ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. దాంతో ఇపుడు ఈ మూవీ మీదనే బాలయ్యతో పాటు ఫ్యాన్స్ ఆశలు ఉన్నాయని అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: