స్టార్ హీరోయిన్ రేసులో పోటీ పడాలి.. టాప్ ఛైర్ పై కన్నేయాలన్న ధ్యాస రకుల్ లో ఏమాత్రం కనిపించడం లేదు. ఎంతసేపూ ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటో పోస్ట్ చేశామా.. ఫిట్ నెస్ వీడియోలు పెట్టామా..అని చూసుకుంటోంది గానీ.. నాలుగు సినిమాలు వెనకేసుకుందాం..పెర్ ఫార్మెన్స్ రోల్స్ చేసి నటిగా పేరు తెచ్చుకుందామన్న ఆలోచన ఈ అమ్మడిలో కనిపించడం లేదు. 

 

రకుల్ ప్రీత్ సింగ్ ఎక్స్ పోజింగ్ పై పెట్టిన శ్రద్ధ సినిమాలపై పెట్టడం లేదా.. వ్యాపారం మీదున్న ఇంట్రెస్ట్ కథల ఎంపికలో చూపించడం లేదా.. తక్కువ టైమ్ లో స్టార్స్ అందరినీ చుట్టేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఖాళీగా ఉంది. పెద్ద హీరోలు ఈ అమ్మడిని అసలు స్టార్ కిందే కన్సిడర్ చేయడం లేదు. 

 

రకుల్ ఆ మధ్య చేతికి అందనంత ఎత్తులో రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. ఆఫర్స్ రాకపోయే సరికి పారితోషికం తగ్గించింది. అయినా..ఛాన్సులు మొహం చాటేశాయి. గత ఏడాది ఆగస్ట్ లో వచ్చిన మన్మథుడు 2 తర్వాత రకుల్ తెలుగులో కెమెరా ముందుకు రాలేదు. ఈ ఖాళీ టైమ్ ను వేస్ట్ చేయకుండా.. రకరకాలుగా కవ్విస్తూ.. ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను పెంచుకుంది రకుల్. 

 

తెలుగులో నటిస్తున్న స్టార్స్ లో కాజల్ కు ఫాలోవర్స్ ఎక్కువ. ఇన్ స్టాగ్రామ్ లో 14మిలియన్ అనుచరులతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. కాజల్ తర్వాత ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంది రకుల్ కే. 14మిలియన్ ఫాలోవర్స్ కు దగ్గరలో ఉంది. ఫేడౌట్ అయినా.. రకరకాల వీడియోలు.. అందాలు కనిపించేలా అరకొర డ్రస్సులతో ఇన్ స్టాను నింపేసి ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది రకుల్. ఒక్కోసారి బాలీవుడ్ భామలను మించి ఎక్స్ పోజ్ చేస్తూ.. ఇన్ స్టాను హీటెక్కిస్తూ.. కెరీర్ గడిపేస్తోంది గానీ.. యాక్టింగ్ పై దృష్టి పెట్టడం లేదు రకుల్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: