ఇప్పుడు తెలుగులో సినిమాల విషయంలో జనాలకు ఆసక్తి చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. భిన్నమైన కథలు వస్తున్న నేపధ్యంలో సినిమాలకు క్రమంగా ఆదరణ అనేది పెరుగుతూ వస్తుంది. మన తెలుగు లో హీరోలు కూడా ఇప్పుడు చాలా వరకు భిన్నమైన కథలను ఎక్కువగా ఆదరించే ప్రయత్నం చేస్తున్నారు. జనాలు కూడా అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. దీనితో ఇప్పుడు హీరోలు అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు మెగా హీరో సాయి ధరం తేజ్ కెరీర్ మొదట్లో ఉన్నాడు. 

 

అతను ఇప్పుడు ఈ విధంగానే భిన్నమైన కథలతో సినిమాలను చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతను వచ్చే సినిమాలో గుండు తో పాటుగా కుంటి గా కూడా కొన్ని సన్నివేశాల్లో కనిపించే అవకాశం ఉందని ఆ సినిమా కోసమని అతను బరూ కూడా తగ్గుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా కథలో అతని పాత్ర చాలా కీలకం అని అందుకే దర్శకుడు ఆ విధంగా అతని పాత్రను డిజైన్ చేసాడు అని ఆ సన్నివేశాల కోసం సాయి చాలా కష్టపడాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇప్పుడు అతను నటించిన సోలో లైఫే సో బెటరు అనే సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. 

 

ఎప్పుడు విడుదల అవుతుంది అనేది స్పష్టత రావడం లేదు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ ఏడాది సినిమాలకు అవకాశాలు లేవు అని అందుకే వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేస్తే అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని భావిస్తున్నారని తెలుస్తుంది. మరి ఏ విధంగా ఈ సినిమాను విడుదల చేస్తారు అనేది చూడాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత అతను ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: