ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదుర్కొని ఇప్పుడు ఒక మంచి సినిమా  వచ్చినా చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నాడు రవి తేజా. అతని కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలను చేసాడు. ప్రస్తుతం అతని కెరీర్ లో చాలా ఆందోళన ఉంది. ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి లో ఉన్నాడు అతను. ఏ సినిమా చేస్తున్నా సరే ఇటీవల వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి. గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నా సరే అవి బాగా ఇబ్బంది పడుతున్నాయి. దీనితో అతనిలో కూడా ఆందోళన ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

అతను ఇప్పుడు నిర్మాతల వద్దకు వెళ్లి భారీ బడ్జెట్ సినిమాలు వద్దు తక్కువ బడ్జెట్ సినిమాలను చేద్దామని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తాను పారితోషికం కూడా ఎక్కువగా తీసుకొను అని కాబట్టి సినిమాలను చాలా జాగ్రత్తగా చేద్దామని తన సన్నిహిత నిర్మాతల వద్దకు వెళ్లి చెప్పాడు అని తెలుస్తుంది. అతనికి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గాని అతి తక్కువ కాలంలో అతనికి వచ్చిన క్రేజ్ గాని ఎవరికి కూడా రాలేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు అతను ఒక మంచి సినిమా వచ్చినా సరే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నాడు అనేది అర్ధమవుతుంది. 

 

అందుకే ఇప్పుడు నిర్మాతలు కూడా అతనికి చాలా వరకు జాగ్రత్తగా కథలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. రవి తేజా తో సినిమా చెయ్యాలి అనుకున్న చాలా మంది ఇప్పుడు అతనికి ఆఫర్లు ఇవ్వడానికి రెడీ అయినా అతని పరిస్థితి చూసి చాలా వరకు తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేయడమే మంచిది అనే భావన లో ఉన్నారు అని తెలుస్తుంది. అతను ఇప్పుడు గోపి చంద్ మలినేని అనే దర్శకుడి సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: