ఈ మధ్య సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ చేస్తున్న సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హైదరాబాద్ తరుపున ఐపిఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటగాడు ఇప్పుడు తన మార్కెట్ ని తెలుగులో పెంచుకోవడానికి గానూ భార్యతో కలిసి ఎక్కువగా సందడి చేస్తున్నాడు. తెలుగు సినిమా డైలాగులను తెలుగు సినిమా పాటలను తెలుగు హీరోలకు పుట్టిన రోజు వేడుకలకు విష్ లు చెప్పడాలు ఈ విధంగా సోషల్ మీడియాలో బాబు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. క్రికెట్ లేక ఖాళీ గా ఉన్న వార్నర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హడావుడి ఎక్కువగా చేస్తున్నాడు. 

 

ఇక ఇప్పుడు అతను ఒక ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. తెలుగు సినిమాల్లో నటించే ఆలోచనలో ఉన్నాడని ఇందుకు గానూ అతను తెలుగు కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. అతనికి తెలుగు సినిమాలో కనపడాలి అనే కోరిక ఉందని అందుకే అతను ఇప్పుడు తెలుగు భాష మీద పట్టుపెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. అతనికి తన దేశంలో తెలుగు ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అని అతని ద్వారా తెలుగు నేర్చుకోవడానికి గానూ అతను తీవ్రంగా కష్టపడుతున్నాడు అని సమాచారం.

 

మరి వార్నర్ తెలుగు నేర్చుకుని ఏ సినిమాలో చేస్తాడో అతనికి ఏ సినిమాలో అవకాశం వస్తుందో అతనికి ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి. ప్రస్తుతం ఐపిఎల్ జరిగే అవకాశాలు అయితే ఏ విధంగా కూడా కనపడటం లేదు. వచ్చే ఏడాది కూడా ఐపిఎల్ కష్టమే అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు వార్నర్ చేస్తున్న సందడి మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా హైలెట్ అవుతుంది. అతని హడావుడి చూసి ఆస్ట్రేలియా ఆటగాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. వార్నర్ ఆల్ ది బెస్ట్ అంటూ అక్కడి ఫాన్స్ కామెంట్ లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: