ఇప్పుడు మన తెలుగులో వస్తున్న సినిమాలు అన్నీ కూడా కమర్షియల్ కోణం లోనే ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా ఈ స్థాయిలో కమర్షియల్ సినిమాలు రావడం లేదు. దీనితో ఇప్పుడు తెలుగు మార్కెట్ ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఈ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునే హీరోలు ఏ భాష లో కూడా లేరు అని అంటున్నారు.  ఇక ఇప్పుడు సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా  పడిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ లో ఆగిపోయాయి. 

 

ఎప్పుడు సినిమాలు వస్తాయి అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇప్పుడు ఒక వార్త వచ్చింది. లాక్ డౌన్ తర్వాత నిర్మాతలు నష్టాల్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు మన హీరోలు కాస్త వారికి సహాయ సహకారాలను అందించే కార్యక్రమాలను ఎక్కువగా చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మన హీరోలు మార్కెటింగ్ కోసం పాన్ ఇండియా సినిమాలకు గానూ బాలీవుడ్ హీరోలను అడిగే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో ఇప్పుడు ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.  కేవలం సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేయిస్తే చాలు అనే భావన లో ఉన్నారు అని తెలుస్తుంది. 

 

అగ్ర హీరోలు అందరూ కూడా ఇప్పుడు తమిళం తెలుగు మలయాళం కన్నడం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసారని అక్కడి హీరోల సినిమాలకు తెలుగులో తెలుగు సినిమాలకు అక్కడ మార్కెటింగ్ చేయించుకునే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. మరి ఏ విధంగా వాళ్ళు రెమ్యునరేషన్ అడుగుతారో లేక ఇది సహాయం రూపంలోనే ఉంటుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీని మీద మహేష్ రామ్ చరణ్ ఎక్కువగా ఫోకస్ చేసారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: