ఇప్పుడు తెలుగులో కొందరు హీరోలు ఇతర భాషల మీద పట్టు పెంచుకుని అక్కడి మార్కెట్ మీద ఫోకస్ చెయ్యాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మార్కెట్ ఇతర భాషల్లో పెంచుకుంటే కలిసి వస్తుంది అనే భావన లో ఉన్నారని సమాచారం. అందుకే ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోలు అందరూ కూడా ధేఇ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చిన్న చిన్న హీరోలు అందరూ కూడా ఇప్పుడు తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే స్థాయి దాటిన హీరోలు మాత్రం ఇతర బాషల మీద ఎక్కువగా ఫోకస్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

 

ఈ తరుణంలో నే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే మన తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న కొందరు బాలీవుడ్ నటులకు కీలక పాత్రలు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు మన హీరోలు. ఇప్పుడు తెలుగులో నటించడానికి గాను రణవీర్ సింగ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అతన్ని తమ సినిమాలో తీసుకోవాలి ప్రభాస్ భావిస్తున్నాడు. ప్రభాస్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది గాని మహారాష్ట్రలో చాలా తక్కువగా ఉంది. అతను మహారాష్ట్రలో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. 

 

ఇందుకోసం తనకు సన్నిహితంగా ఉండే వారి ద్వారా మహారాష్ట్రలో మంచి ఫాలోయింగ్ ఉండే రణవీర్ సింగ్ ని తన సినిమాలో తీసుకోవడానికి గానూ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నిజం ఏంటీ అనేది తెలియదు గాని ఇప్పుడు అతని తో  ప్రభాస్ చర్చలు కూడా జరుపుతున్నాడు అని సమాచారం. మరి ఎప్పుడు ఏ సినిమాలో అతన్ని తీసుకుంటాడు అనేది చూడాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: