టాలీవుడ్ లో చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు అనగానే ప్రేక్షకులు చాలా వరకు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన కూడా తన ప్రేక్షకులకు న్యాయం చేయడానికి గానూ ఎంతో కష్టపడుతూ ఉంటారని మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిరంజీవి తన సినిమా కోసం భారీగా బరువు తగ్గే ఆలోచనలో ఉన్నాడని సమాచారం. ఆయన తన సినిమా కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు వైద్యుల ద్వారా బరువు తగ్గే కార్యక్రమంలో ఉన్నారు అని తెలుస్తుంది. 

 

లాక్ డౌన్ లో చిరంజీవి ఈ ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. బరువు తగ్గడం ద్వారా తన సినిమాలో కొన్ని సన్నివేశాలను ఎవరి సహాయం లేకుండా చేయవచ్చు అని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాలో చిరంజేవి పాత్రలో చాలా వరకు కొన్ని కొన్ని సన్నివేశాలు డూప్ లేకుండా ఉంటేనే బాగుంటాయి అని అందుకే చిరంజీవి ఆ విషయం తెలుసుకుని ఆ విధంగా కష్టపడుతున్నారు అని సమాచారం. రామ్ చరణ్ కూడా నిర్మాతగా తన తండ్రికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు అని సమాచారం. 

 

కథ లో రామ్ చరణ్ పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది చెప్పడం ప్రస్తుతం మాత్రం చాలా కష్టమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రామ్ చరణ్ ఆ సినిమాలో నటించడం ఓకే అయినా సరే ఆయన మాత్రం బిజీ గా ఉన్నాడు అని కాబట్టి య్తెప్పుడు షూటింగ్ లో పాల్గొంటారు అనేది చెప్పలేమని టాలీవుడ్ వర్గాలు కూడా అంటున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఇప్పట్లో అయ్యే అవకాశం లేదని అందుకే రామ్ చరణ్ ఏ మాట కూడా తన టీం కి చెప్పడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: