దేశ వ్యాప్తంగా కరోనా  మహమ్మారి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.  కరోనా వల్ల ఎక్కువ కష్టపడ్డది వలస కార్మికులే.. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎక్కడికి వెళ్లలేక ఉన్న చోట పని లేక నానా ఇబ్బందులు పడ్డారు.  ఈ సమయంలో కొంత మంది సెలబ్రటీలు వలస కార్మికులకు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. అందులో అమితా బచ్చన్, సోనూ సూద్ వలస కార్మికులకు అండగా ఉన్నారు.   ముంబై నగరంలో చిక్కుకున్న ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను తరలించేందుకు 10 బస్సులను ఏర్పాట్లు చేశారు. ఏబీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ యాదవ్, మాహిం దర్గా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ సుహైల్ ఖండ్వానీలు ముంబై నగరం నుంచి 43 మంది పిల్లలు, 225 మంది వలస కార్మికుల 10 బస్సుల్లో తరలించారు. 

 

వలస కార్మికులను వారి స్వస్థలమైన యూపీకి పంపించేందుకు అమితాబ్ ముందుకు రావటంతో తాము ఈ ఏర్పాట్లు చేశామని హాజీఅలీ, మహిం దర్గా నిర్వాహకులు సబీర్ సయ్యద్ తెలిపారు. తమ దర్గాతో బిగ్ బికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1983వ సంవత్సరంలో హాజీఅలీ దర్గాలో అమితాబ్ కూలీ సినిమాను చిత్రీకరించారని అన్నారు. ఇదే చిత్రం షూటింగ్ సమయంలో అమితాబ్  తీవ్రంగా గాయపడి కొన్ని నెలలతర్వాత కోలుకున్నారని అన్నారు.  తాజాగా అమితాబచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎన్నో సంఘటనలు చూశానని.. కానీ ఇంత భయంకరమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని అన్నారు. 

 

 ఈ 78 ఏళ్లల్లో నేర్చుకోలేనిది ఈ కరోనా సమయంలో నేర్చుకున్నానని చెప్పారు. గత రెండు నెలలుగా లాక్‌డౌన్‌ మొత్తం సమయాన్ని కూతురు ఇంట్లో గడిపిన అమితాబ్.. అక్కడ మనుమరాలు, ఇతర చిన్నారులతో సమయం గడిపారు. లాక్‌డౌన్‌ కారణంగా జయబచ్చన్‌ ఢిల్లీలోనే ఉండిపోయారు.  తన 78 ఏండ్ల వయసులో నేర్చుకోలేని విషయాలను కేవలం లాక్‌డౌన్‌ పీరియడ్‌ నాకు నేర్పింది అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: