సర్కారు వారి పాట... ఇప్పుడు టాలీవుడ్ ని కాదు సోషల్ మీడియా ను కూడా షేక్ చేస్తున్న  టైటిల్. మహేష్ బాబు ఇలాంటి టైటిల్ తో మొదటి సారి సినిమా చేయడం తో ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు పాత్రకు సంబంధించి దర్శకుడు పరుశురాం కష్టపడుతున్న విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథలో ఏ విధంగా మార్పులు కావాలి అంటే ఆ విధంగా మార్పులు చేయడమే కాకుండా మహేష్ అడిగే కొన్ని కోణాలను చూపించడానికి గానూ చాలా వరకు కష్టపడుతున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. మహేష్ ఈ సినిమాలో చెవికి రింగ్ తో కనిపిస్తాడు. వాస్తవానికి మహేష్ బాబు నటించిన అతిధి సినిమాలో కూడా అతను రింగ్ తోనే కనిపించాడు. కాని ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా మహేష్ బాబు అలా కనపడిన సందర్భం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు తొలిసారి అతను ఈ విధంగా కనపడుతున్నాడు. ఇక టాటూ తో కూడా మహేష్ బాబు ఈ సినిమాలో కనపడే అవకాశాలు ఉన్నాయి. దీని తో సినిమా ఏ విధంగా ఉంటుంది అంటూ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

 

కథ గురించి ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది గాని ఇది చేపల చెరువుల ఆధారంగా ఉండే అవకాశం ఉంది. మరి గతంలో మహేష్ బాబు కి చేవుకి రింగ్ కలిసి రాలేదు. మరి ఈ సినిమాలో ఏ విధంగా కలిసి వస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా కోసం బరువు పెరుగుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఎంత పెరుగుతాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: