మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్. వరస హిట్లతో జోరు మీద ఉన్నాడు. మహేష్ కొత్త సినిమాలు కూడా బాగానే కమిట్ అవుతున్నాడు. ఆయన ఇపుడు చేస్తున్న సినిమా సర్కార్ వారి పాట క్రిష్ణ‌ బర్త్ డే వేళ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి కెవ్వు కేక పెట్టించాడు.

 

ఇక మహేష్ లుక్ ఈ మూవీలో చాలా వెరైటీగా ఉంది. ఇంకా చెప్పాలంటే పోకిరి నాటి మహేష్ కనిపిస్తున్నాడు. ఎందుకో మహేష్ మళ్ళీ మాస్ టచ్ చేశాడనిపిస్తోంది. మాస్ క్యారక్టర్ సరైంది పడాలి కానీ మహేష్ ఊపేస్తాడు అనడంలో డౌట్ లేదు.

 

దానికి ఉదాహరణగా పోకిరిని చెప్పుకోవచ్చు. ఆ మూవీ మహేష్ స్టామినా ఏంటో చెప్పింది. ఇక ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. ఇవన్నీ ఇలా ఉంటే మహేష్ కొత్త సినిమాలో హీరోయిన్ల విషయం ఇపుడు చర్చకు వస్తోంది. అయితే ఒక టాక్ కూడా నడుస్తోంది. మహేష్ పక్కన హాట్ అండ్ స్వీట్ బ్యూటీ లావణ్యా త్రిపాఠీని సెలెక్ట్ చేశారని అంటున్నారు.

 

మహేష్ బాబు పక్కన మల్లె తీగలా ఈ అమ్మడు కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ మూవీలో మహేష్ క్యారక్టర్ ఏమిటో రివీల్ కాకపోయినా ఆయన పక్కన జోడీగా లావణ్య లాంటి హీరోయిన్ అవసరం అయిందని అంటున్నారు. దాంతో ఆమె పేరు చక్కర్లు కొడుతోంది.

 

ఇప్పటికే అందం, అభినయం ఉన్నా సరైనా చాన్సులు లేక లావణ్య త్రిపాఠి వెనకబడిపోయింది. ఇపుడు మహేష్ మూవీలో కనుక ఆఫర్ వస్తే మాత్రం టాలీవుడ్లో ఈ దెబ్బ‌కు లావణ్య జెండా పాతేస్తుందని అంటున్నారు. మరి చూడాలి ఏంటో అసలు విషయం.

 

ఇప్పటికే తన హాట్ హాట్ అందాలను ఇన్స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేస్తూ కుర్ర కారుకు కిక్కెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి దశ తిరిగిపోయే ఆఫర్ మాత్రం ఇది అంటున్నారు. అయితే చిత్ర యూనిట్ అసలు విషయం చెప్పాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: