సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గానే కాదు 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేసిన సినిమా పోకిరి. ఈ సినిమా సృష్ఠించిన సంచలనం అంతా ఇంతా కాదు. పూరి జగన్నాధ్ మహేష్ బాబు ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా పోకిరి ఇద్దరి కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా మిగిలిపోయింది. చెప్పాలంటే పోకిరి లాంటి సినిమా డైరెక్టర్ గా పూరి జగన్నాధ్..హీరోగా మహేష్ బాబు మళ్ళీ చేయలేదనే చెప్పాలి.

 

ఇక పోకిరి సినిమా తర్వాత ఎన్నో సందర్భాలలో అటు మహేష్ ఫ్యాన్స్ ఇటు పూరి ఫ్యాన్స్ మరోసారి మీ కాంబినేషన్ లో పోకిరి లాంటి సినిమా ఎప్పుడు వస్తుంది ..? అది పోకిరి 2 అనుకోవచ్చా ..? అంటు అడిగిన మాట వాస్తవమే. అయితే పోకిరి 2 కాకపోయినప్పటికి మహేష్ పూరి కలిసి బిజినెస్ మాన్ అనే పక్కా కమర్షియల్ సినిమాని చేసి మరోసారి భారీ సక్సస్ ని అందుకున్నారు. ఈ సినిమా కూడా అప్పట్లో పెద్ద సంచలనం అయింది. 

 

ఇక ఈ రెండు సినిమాల తర్వాత హ్యాట్రిక్ హిట్ వస్తుందని చాలామంది అభిమానులు అలాగే ఇండస్ట్రీ వర్గాలు భావించారు. పూరి కూడా ముచ్చటగా మూడో సినిమా జనగణమన సినిమాని తెరకెక్కించి భారీ సక్సస్ కొట్టాలని అనుకున్నారు. కాని ఎందుకనో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కాని పూరి జనగణమన మాత్రం ఎప్పటికైనా మహేష్ తోనే చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇంతకముందు పూరి ..  మహేష్ సక్సస్ లో ఉన్న దర్శకులతోనే  సినిమా చేస్తాడు అంటు చేసిన కామెంట్స్ కి మళ్ళీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేసే అవకాశాలు దాదాపు లేవనే అనుకున్నారు.

 

కాని మహేష్ ఇటివల ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నాకు ఇష్టమైన దర్శకులలో పూరి జగన్నాధ్ ఒకరు ..తనకోసం వేయిట్ చేస్తున్నాను..ఆయన వచ్చి కథ నెరేట్ చేస్తే నేను రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీన్ని బట్టి మహేష్ బాబు పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో అనుకున్న జనగణమన ఉంటుందని అర్థమవుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: