ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమా రంగంలోని పరిస్థితులు రోజురోజుకు మారుతూ పోతున్నాయి. ఎక్కువగా పాశ్చాత్య పోకడలను సినిమా రంగం వారు అనుసరిస్తున్నారు, వాటినే నేటి యువత కొంతవరకు అనుసరిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనే వాదన కూడా ఉంది. అయితే మరోవైపు ప్రేక్షకుల యొక్క అభిరుచి మేరకే తాము సినిమాలు తీస్తున్నాం అని, వారు ఆదరిస్తున్నందువల్లనే నేటి సినిమాల్లో ఎక్కువగా అటువంటివి పెట్టవలసి వస్తోందని అంటున్న దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక ఎక్కువగా రొమాన్స్, శృంగారం తో పాటు హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేసే సన్నివేశాలను చూడడానికే ప్రేక్షకులు కూడా ఇష్టపడుతున్నందువల్లనే తాము కూడా అలానే తీయవలసి వస్తోంది అనేది వారి వాదన. 

IHG

అయితే సినిమాల్లోని కొన్ని సీన్స్ లో హీరోయిన్ ఎక్స్ పోజింగ్ చేయకపోతే అవి పండవని, అందువలనే అవసరం మేరకు వారితో ఎక్స్ పోజింగ్ సన్నివేశాలు చేయవలసి వస్తోందని అంటున్నారు వారు కూడా ఉన్నారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులు కొత్తగా చిత్ర సీమకు ప్రవేశించిన సమయంలో సావిత్రి, జమున, అంజలి దేవి, బి సరోజ, కృష్ణకుమారి, భానుమతి సహా అప్పటి హీరోయిన్లు ఏ మాత్రం ఎక్స్ పోజింగ్ కు అవకాశం లేకుండా, ఎక్కువగా తమ తమ పాత్రలకు ప్రాధాన్యత గల చిత్రాల్లో నటించడం జరిగేది. అయితే అక్కడక్కడా చాలా తక్కువ మంది హీరోయిన్లు, అది కూడా సినిమాలోని ఒకటి రెండు సన్నివేశాల్లో మాత్రమే పాశ్చాత్య దుస్తులను ధరించే వారు. 

IHG

నిజంగా అప్పటి సినిమా లైఫ్ ఒక స్వర్ణయుగం అని, అలానే నాటి నటీమణులు సిసలైన హీరోయిన్లని అంటున్నారు కొందరు. అయితే ఆ వాదనలో చాలావరకు నిజం లేకపోలేదని, కానీ మారుతున్న ప్రస్తుత పరిస్థితులు, పద్దతులను బట్టి సినిమాలో కీలకమైన హీరోయిన్ పాత్రధారి సైతం రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎక్స్ పోజింగ్ వంటివి చేయకతప్పని స్థితి ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రాను రాను హీరోయిన్స్ ని కేవలం ఎక్స్ పోజింగ్ చేసే వారుగా మాత్రమే చూపించే సినిమాలు వచ్చినా రావచ్చని, ఇప్పటికే కొంతవరకు ఆ స్థితికి సినీ పరిశ్రమ చేరుకుందని కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: