జూన్ నెల ఎంటర్ కావడంతో సినిమా షూటింగ్ ల విషయంలో టాలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. చాలమంది దర్శక నిర్మాతలు ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే తమ షూటింగ్ లు మొదలు పెట్టుకోవడానికి రంగం సిద్ధం చేస్తునప్పటికి ఈ హడావిడి అంతా కార్యరూపంలోకి రాకపోవచ్చు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.


ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి కనిపిస్తూ షూటింగ్ లు స్టార్ట్ చేసే ఆలోచన నూటికి తొంభై శాతం మంది నిర్మాతలకు ఉన్నప్పటికీ లోలోపల వారిని కరోనా భయాలు వెంటాడుతున్నట్లు టాక్. దీనికికారణం షూట్ టైమ్ లో ఎవరికైనా కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ?  అన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో టెన్షన్ పడుతున్నట్లు టాక్.  


సినిమా షూటింగ్ లను ఆగస్టు నుంచి మొదలుపెడితే మంచిది అన్న భావన కొందరి నిర్మాతలలో ఉంది అని అంటున్నారు. అయితే ఈవిషయంలో పెద్దసినిమాల నిర్మాతల ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వెంటనే ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా వెంటనే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను మొదలు పెట్టడానికి తన టీమ్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు టాక్.


ఈనెల నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మొదలు అవ్వకపోతే ఈ మూవీని కనీసం 2021 సమ్మర్ కు అయినా విడుదల అవ్వడం కష్టం అన్నఅభిప్రాయం రాజమౌళికి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈమూవీ భారీ బడ్జెట్ సినిమా కావడంతో వడ్డీల భారం కూడ పెరిగి పోవడం రాజమౌళిని కలవర పెడుతున్నట్లు టాక్. అదేవిధంగా ఈ సినిమా నుంచి తమకు విముక్తి కలిగించమని జూనియర్ చరణ్ లు పరోక్షంగా ఇస్తున్న ఒత్తిడి రాజమౌళి తట్టుకోలేకపోతున్నాడు అని అంటున్నారు. దీనితో కనిపించని శత్రువు కరోనా తో ధైర్యంగా ముందుకు దూకి రాజమౌళి చేయబోతున్న పోరాట ఫలితం చూసి మిగతా సినిమాలు కూడ తమ షూటింగ్ ల విషయంలో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకునే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: