తెలుగు సినిమాల్లో అయినా ఏ సినిమాలో అయినా సరే నిలబడాలి అంటే కచ్చితంగా స్కిన్ షో అనేది చాలా అవసరం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్కిన్ షో చేయకపోతే ఎవరిని అయినా సరే పక్కన పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటా౦. అగ్ర హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఏ హీరో సినిమాలో చేసినా సరే స్కిన్ షో అనేది చాలా వరకు కీలకం అనే చెప్పాలి. మన తెలుగులో అలా స్కిన్ షో చేసిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండగా చేయలేని వాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పుకునే పేర్లు కొన్ని ఉన్నాయి. 

 

అమృత రావు... మహేష్ బాబు తో సినిమా చేసినా సరే ఆమె మాత్రం ఎక్కువ కాలం సినిమాల్లో ఉండలేదు అనేది వాస్తవం. మహేష్ బాబు తో ఆమె అతిధి సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె స్కిన్ షో చేయలేదు. దీనితో ఆమెను పక్కన పెట్టారు దర్శక నిర్మాతలు. ఆమె ఆ సినిమాలో చాలా బాగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి పేరు వచ్చినా సరే ఆమెను మాత్రం తర్వాతి సినిమాలకు దాదాపుగా తీసుకోలేదు అనే చెప్పవచ్చు. దీనికి కారణం ఆమె స్కిన్ షో చేసేది లేదు అని చెప్పడమే. 

 

అగ్ర హీరోయిన్ గా అయ్యే అవకాశాలు ఆమెకు ఎక్కువగా ఉన్నాయని స్కిన్ షో చేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని ఎవరు చెప్పినా సరే ఆమె మాత్రం ఎక్కడా లిమిట్ దాటి సినిమాలను అసలు చేయలేదు. బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినా సరే ఆమె అక్కడ కూడా చాలా వరకు స్కిన్ షో చేయలేదు అనే చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత ఆమె కనపడలేదనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: