మహానటి సావిత్రి... తెలుగు తమిళ సినిమా ఉన్నన్ని రోజులు కూడా ఆమె గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు సినిమా జనాలు. ఆమె లేనిదే హీరోయిన్ లు లేరు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఆమెను చూసి నటన నేర్చుకున్న హీరోయిన్ ల సంఖ్యా కూడా మన తెలుగులో చాలానే ఉంది అని చెప్పుకోవచ్చు. నటన లో ఆమె తర్వాతే ఎవరు అయినా అనే విధంగా ఆమె నటించారు అనేది వాస్తవం. ఇక ఆమె చేసిన సినిమాలు ఆమెకు వచ్చిన పేరు ఆమెను కీర్తించిన అభిమానులు ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కి కూడా లేరు అనేది వాస్తవం. 

 

ఇండియన్ సినిమాలో మొదటి లేడీ సూపర్ స్టార్ ఆమె అనేది వాస్తవం. ఇక ఆమె నటన విషయానికి వస్తే అందం చూపించాల్సి వచ్చినా సరే ఆమె ఏదోక విధంగా మ్యానేజ్ చేసే వారు గాని ఎక్కడా కూడా తన పరిధి దాటి ఆమె నటించిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఆ విధంగా ఆమె నటించారు. ఇక ఆమె చేసిన సినిమాలు ఏది చూసినా సరే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రతీ సీన్ ని కూడా ఆమె చాలా అందంగా ప్రేక్షకులకు  అందించారు అని ఆమెను నిత్యం విమర్శించే వాళ్ళు కూడా చెప్పే మాట. 

 

అదే విధంగా ఆమె చేసిన సినిమాలు ఆమెకు తీసుకొచ్చిన పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె నటన లో ప్రతీ ఒక్కటి కూడా సంచలనమే. అగ్ర హీరోలతో ఆమె డాన్స్ వేసిన సమయంలో కూడా ఎక్కడా కూడా తన స్కిన్ అనేది అభిమానులకు అసభ్యంగా కనపడవద్దు అని దర్శకులకు చెప్పి మరీ ఆమె సినిమాలు చేసిన సందర్భం ఉంది అని అంటారు. ఆ విధంగా ఆమె సినిమాల్లో తన ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: