సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే, సమంత ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవ విషయం అందరికీ తెలిసిన విషయమే. మజిలీ సినిమాలో సమంత ఏ విధంగా చూసినా కూడా అందంగా లేదు అంటూ పూజా హెగ్డే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. కానీ ఆ పోస్టుకు నాకు ఏమీ సంబంధం లేదు అని పూజా హెగ్డే తెలియజేస్తుంది. నా అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని తెలియజేస్తుంది.

IHG


ఇక ఇదిలా ఉండగా మరో వైపు సమంత ఫ్యాన్స్ మాత్రం పూజాహెగ్డే కావాలనే ఇలా చేస్తుంది అంటూ వాదిస్తున్నారు. పూజా హెగ్డే సమంతకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆమె ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సమంతకు చిన్మయి, నందిని రెడ్డి వారు  కూడా మద్దతు పలకడం జరిగింది. ఏది ఏమైనా కానీ ఈ ఒక్క పోస్టు తోనే పూజా హెగ్డే, సమంత మధ్య ఉన్న అనుబంధం ఒక్కసారిగా దెబ్బతిని ఉందనే చెప్పాలి. ఈ సమయంలో సమంతకు ప్రముఖ హీరోయిన్ రష్మిక చాలా దగ్గర అయిపోయింది.

IHG
ఇది ఇలా ఉండగా సమంత తాజాగా ఫాన్స్ తో చాట్ చేసే తరుణంలో... నాకు రష్మిక అంటే చాలా ఇష్టము అని తెలియజేసింది. అలాగే రష్మిక డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ ఫ్యాన్స్ కు తెలియజేసింది. ఒక్కసారిగా ఊహించని విధంగా సమంత ఇలాంటి స్పందన రావడంతో రష్మిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఈ తరుణంలోనే థాంక్యూ సమంత అంటూ రష్మిక స్పందించడం జరిగింది. ఏది ఏమైనా కానీ మూడురోజుల గ్యాప్ లో సమంతకు పూజా హెగ్డే శత్రువు అయ్యినట్లుగా, రష్మిక మంచి స్నేహితురాలు అయింది అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: