2010 సంవత్సరం లో సినీ ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసి ఐదారు తమిళ తెలుగు సినిమాలలో నటించిన ప్రణిత సుభాష్ ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో తళుక్కు మంది. సమంత అక్కినేని సోదరి పాత్రలో నటించిన ప్రణీతకు బాగానే గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో ప్రణీత చాలా అందంగా కనిపించింది అని చెప్పుకోవచ్చు. కొత్త వానికి ప్రణీత సమంత కలిసి బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో నటించింది. మహేష్ బాబు హీరోగా నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో ప్రణీత చాలా సాంప్రదాయకంగా చీర కట్టుకొని కనిపించింది. ఆమె చీరకట్టు అందానికి అందరూ ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు. 2013వ సంవత్సరంలో విడుదలైన అత్తారింటికి దారేది చిత్రంలో కూడా ఆమె స్కిన్ షో చేయలేదు. 2016 సంవత్సరంలో విడుదలైన బావా చిత్రంలో సిద్ధార్థ సరసన నటించిన ప్రణీత తన చీర కట్టు అందాలతో అందర్నీ ఫిదా చేసేసింది. 


హీరో కార్తీ తో కలసి శకుని సినిమా లో నటించిన ప్రణీత అప్పట్లో ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొనది. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... 'నాకు స్కిన్ షో చేయడం అస్సలు ఇష్టం లేదు. ప్రేక్షకులు నా పాత్ర నటనకు చూడాలి కానీ నా బాడీ ని కాదు. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా చెడు పాత్రలో నటించడానికి నా మనసు అస్సలు ఒప్పుకోదు', అని ఆమె చెప్పుకొచ్చింది. 


ఇకపోతే ప్రణీత ప్రస్తుతం అందరి హీరోయిన్ల కంటే మంచి మనసు కల వ్యక్తి గా పేరు తెచ్చుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న లక్షల మందికి వలస కూలి నాకు ఆహార పొట్లాలను అందించి అందరి ప్రశంసలను అందుకుంది. మంచి మనస్తత్వం కలిగిన ప్రణీత సుభాష్ కి ఎన్నో మంచి సినిమా అవకాశాలు రావాలని ఆమె అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: