నితిన్ హీరోగా నటించిన ఇష్క్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా పరిచయమైన నిత్యా మీనన్ ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి అందరిని బాగా మెప్పించింది. నిత్యామీనన్ ఎంతో పాపులర్ అయినప్పటికీ... తాను మాత్రం వార్తలలో చాలా తక్కువ గా నిలుస్తుంది. ఆమె ఎక్కువగా ఇంటర్వ్యూ లలో కూడా పాల్గొనదు. కేవలం సినిమాల్లో తప్ప మిగతా అన్ని సమయాలలో ప్రేక్షకులకు కనిపించకుండా తన జీవితాన్ని కొనసాగిస్తోంది నిత్యామీనన్. అప్పుడప్పుడో 2011వ సంవత్సరంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీనన్ ని మీకు ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించారు. సమాధానమిస్తూ ప్రభాస్ ఎవరండి అని అడగగా ఆ ఇంటర్వ్యూ నెట్టింట్లో వైరల్ అయింది. 

 

 

చాలామంది ఆమెపై నీకు ప్రభాస్ ఎవరో తెలియదా అని ఇష్టారాజ్యంగా తిట్టిపోశారు. ఆ చేదు అనుభవం తో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఇక మీదట ఇంటర్వ్యూలలో పాల్గొనకుండా ఉండాలని నిశ్చయించుకుంది. ఇప్పటివరకు అందరూ తనవారే అనుకున్న నిత్యమీనన్ ఒకేసారి తన పై వస్తున్న వ్యతిరేకత చూసి ఖంగు తిన్నది. అందుకే తను సోషల్ మీడియాలో గానీ, ఇంటర్వ్యూలలో పలు కార్యక్రమాల్లో అసలు పాల్గొనడానికి ఇష్టపడదు. ఒకవేళ ఏదైనా అనకూడదు అంటే ప్రేక్షకులకి మళ్ళీ కోపం వస్తుంది అని భయం ఆమెకు పట్టుకుంది. కేవలం సినిమాలు తీయడం చిత్రీకరణ సమయంలో అందరితో మంచిగా ఉండటమే తాను చేస్తుంది తప్ప అతి చేయదు. 

 


నిత్యామీనన్ మాటలను విన్న తర్వాత ఆమెకి ఆధ్యాత్మికత పై ఆసక్తి ఉందని స్పష్టమవుతోంది. తన ని ఎప్పుడు ఒక దివ్య శక్తి కాపాడుతుందని నిత్యామీనన్ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఏది తప్పో ఏది ఒప్పో తనకి ఎప్పుడూ ఎవరో ఒకరు చెప్తారటుంది అంటుంది నిత్యా మీనన్. మొదట్లో ఆమె సినిమాల్లో నటించడానికి అస్సలు ఇష్టపడలేదు. సినిమాల్లో హీరోయిన్ వేషాలు వేస్తున్నా అప్పటికీ ఆమె ఏదో తప్పు చేస్తునట్టు భావించేది. కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత తాను పుట్టింది కేవలం నటించడం కోసమేనని తెలుసుకుంది. ఆ తర్వాత ఇష్టం గా నటించడం ప్రారంభించింది. అయితే అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటించడానికి నిత్యామీనన్ అసలు అంగీకరించదు. అందుకే తాను రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమాలో నటిస్తోంది. తాను చెత్త సినిమాల్లో నటించనని... మంచి కథా నేపథ్యం ఉన్న సినిమాల్లోనే నటిస్తానని... తన నటనా ప్రతిభను పెద్ద సినిమాల్లో చూపించడం వల్ల చెడ్డపేరు వస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. తన నటన తప్ప ప్రేక్షకులకు స్కిన్ షో గాని గ్లామర్ గానీ చూపించని ఆమె స్పష్టం చేసింది. అందుకేనేమో నిత్యామీనన్ ఏ సినిమాల్లో స్కిన్ షో చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: