తెలుగు ప్రేక్షకుల మనస్సులలో చిరస్థాయి గా నిలిచిపోయిన సౌందర్య తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే అకాల మరణం చెందింది. 2004వ సంవత్సరంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె, తన సోదరుడు చనిపోయారు. అప్పట్లో దక్షిణ భారతదేశ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌందర్య కి పోటీ ఇచ్చిన ఏ హీరోయిన్ లేదంటే అతిశయోక్తి కాదు. అందరి బడా హీరోల సరసన నటించిన సౌందర్య మరో సావిత్రి అనే పేరును తన నటనా చాతుర్యంతో సంపాదించుకుంది. కన్నడ తల్లిదండ్రులకు జన్మించిన సౌందర్య కన్నడ వ్యక్తినే పెళ్లి చేసుకుంది. అంతపురం, రాజా, అమ్మోరు, ఆత్మ మిత్ర, ద్వీప సినిమాలో నటించినందుకు గాను ఆమెకు ఉత్తమ నటి అవార్డులు ఎన్నో లభించాయి.

IHG


ఆమెకు ఎంత పాపులారిటీ ఉన్న ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చినా... ఏ సినిమాలో స్కిన్ షో చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆయన నటించిన అన్ని సినిమాల్లో ఎక్కువగా సాంప్రదాయకమైన చీరలు, చుడిదార్ వస్త్రాలను ధరించింది. సినీ పరిశ్రమ లో పాపులర్ కావాలంటే అందం అభినయం నటనా చాతుర్యం ఉన్నవారు స్కిన్ షో చేయాల్సిన అవసరం లేదని ఆమె చెప్పకనే చెప్పింది. 

IHG


సౌందర్య 12 సంవత్సరాల లోనే 120 సినిమాల్లో నటించి తన క్రేజ్ ఎంత గొప్పగా ఉందో నిరూపించుకుంది. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ సరసన సౌందర్య అమాయకపు యువతి పాత్రలో ఎంత సహజంగా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆమె ఎంతమందితో నటించినప్పటికీ స్కిన్ షో చేయడానికి మాత్రం ససేమిరా అనే తన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసేది. ఏది ఏమైనా మన తెలుగు ఇండస్ట్రీ అలనాటి సావిత్రి, సావిత్రి లాంటి మహా నటి సౌందర్య లను అర్థాంతరంగా కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: