తెలుగులో ఫ్యామిలీ హీరోయిన్ గా చాలా తక్కువ కాలంలో పేరు తెచ్చుకున్న హీరోయిన్ లయ. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా చిన్న హీరోలతో సినిమాలను చేసినా సరే ఆమె చాలా అందంగా నటించారు. ఆమె నటనలో చాలా వరకు హుందాతనం ఉండేది. ఆమె హావ భావాలు గాని ఆమె వేసుకున్న దుస్తులు గాని ఎక్కడా కూడా ఇబ్బంది పడే విధంగా లేవు అనేది వాస్తవం. ప్రతీ హీరో సినిమాలో ఆమె దాదాపుగా కనపడ్డారు గాని ఎక్కడా కూడా చికాకుగా ఆమె నటించలేదు. అయితే తనకు వచ్చిన పేరు ని కాపాడుకోవడం లో ఆమె బాగా ఇబ్బంది పడ్డారు అనే చెప్పవచ్చు. 

 

ఇమేజ్ ని ఆమె కాపాడుకోలేదు అనే అంటారు. అగ్ర హీరోలతో సినిమాలు వచ్చినప్పుడు ఆమె డేట్స్ సరిగా ఇచ్చే వారు కాదని ఫ్యామిలీ ని అడగాలి అనే విధంగా ఆమె వ్యవహరించారు అని అందుకే ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు అని అంటారు. ఆమె తన పేరు ని కాపాడుకోవడంలో ఎక్కువగా తడబడ్డారు అనే మాట అక్షరాలా నిజం. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. డాక్టర్ ని పెళ్లి చేసుకుని ఆమె ఇంట్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆమె పెద్దగా సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే నటించడం లేదు అని సమాచారం. 

 

మలయాళం సినిమాలో ఆమెకు డాక్టర్ గా నటించే అవకాశం వచ్చినా సరే ఆమె మాత్రం పెద్దగా నటించడానికి ఆసక్తి చూపించలేదు అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఆమె ఖాళీ గానే ఉంటున్నారు. మన తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఆమె గురించి చాలా మంచి కామెంట్స్ చేసే వారు. అటు దర్శకులకు కూడా ఆమె మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నా సరే ఆమె కాపాడుకోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యారు అని చాలా మంది అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: