తెలుగులో చాలా తక్కువ కాలంలో లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ తెచ్చుకున్నారు విజయ శాంతి. తెలుగు నుంచి వెళ్లి తమిళంలో కూడా ప్రభావం చూపించిన అతి తక్కువ మందిలో ఆమె కూడా ఒకరు. ఏ హీరోయిన్ కూడా ఆమె చేసిన సాహసాలు చేయలేదు. ఆమె చాలా వరకు మంచి సినిమాలను అగ్ర హీరోలతో చిన్న హీరోలతో చేసారు. మాస్ సినిమాలు కూడా ఆమె చాలా ధైర్యంగా నటించి మెప్పించారు. ఆమె నటనకు చాలా మంచి పేరు వచ్చింది చాలా తక్కువ కాలంలో అనేది వాస్తవం. ఆమె నటన చూసిన తమిళ ప్రేక్షకులు అయితే ఆమెను తమిళం లో ఉండిపోవాలి అని కూడా కోరారు. 

 

చాలా మంది అగ్ర హీరోలతో ఆమె పని చేసారు. అక్కడ ఎందరో అగ్ర హీరోలతో సినిమాలను చేసి హిట్స్ కొట్టేసారు ఆమె. ఇక మన తెలుగు విషయానికి వస్తే ఆమెకు చాలా తక్కువ కాలంలో ఇమేజ్ రావడం తో ఆమె తో సినిమా చెయ్యాలి అంటే హీరోలు కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వచ్చింది. ఇక ఆమె నటన అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వారు గాని గ్లామర్ తో నటించినా సరే ఎక్కడ కూడా ఆమె అసభ్యంగా నటించలేదు అనేది వాస్తవం. చాలా అందంగా కనపడటానికి ప్రయత్నం చేసారు గాని అసభ్యంగా కనపడటానికి కాదూ. 

 

చాలా మంది స్టార్ హీరోలతో పని చేసినా సరే చాలా వరకు ఆమె తన పరిధిలోనే స్కిన్ షో చేసారు. అగ్ర హీరోలతో ఆమెకు అవకాశాలు వచ్చినా సరే అనవసరంగా చూపించే ప్రయత్నం ఆమె చేయలేదు అనేది వాస్తవం. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: