తెలుగులో చాలా తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఆర్తి అగర్వాల్. తక్కువ కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఆమె. వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. ఆమె సినిమాలు ఆమె నటనకు మంచి గుర్తింపు చాలా తక్కువ కాలంలోనే వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె కెరీర్ లో పని చేసిన హీరోలు కూడా దాదాపు అందరూ స్టార్ హీరోలే అయితే ఆమె ఎక్కువ కాలంలో ఆ స్టార్ ఇమేజ్ ని కాపాడుకోలేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె మాత్రం ఆ స్టార్ ఇమేజ్ ని కాపాడుకోవడంలో విఫలం అయింది. 

 

ఇక ఇది పక్కన పెడితే ఆమె సినిమాల్లో ఆమె నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. అదే విధంగా ఆమె ఎక్కడా కూడా అతిగా స్కిన్ షో చేసిన సందర్భం అనేది లేదు అని చెప్పాలి. అనవసరంగా ఆమె ఎక్కడా కూడా చూపించే ప్రయత్నం చేయలేదు. ఎంత స్టార్ హీరో సినిమా అయినా సరే ఆమె చాలా వరకు తన పరిధిలోనే నటించి మెప్పించారు చీర కట్టు లేదా లంగా ఓణీ లో మాత్రమే ఆమె నటించారు. ఎక్కడో కొన్ని కొన్ని సన్నివేశాల్లో ఆమె స్కిన్ షో చేసినా సరే పరిధి మాత్రం దాటలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆమె చిరంజీవి సినిమా ఇంద్రా లో చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. 

 

ఆ సినిమాలో ఆమె విలన్ కుమార్తె గా స్నేహ లతా రెడ్డి అనే పాత్రలో నటించింది. ఆమె నటనకు చాలా మంచి గుర్తింపు వచ్చింది ఆ సినిమా తర్వాతే. ఆమె కు అక్కడి నుంచి మంచి అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం ఆ ఇమేజ్ ని కాపాడుకోవడం లో ఘోరంగా ఫ్లాప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: