తెలుగు, తమిళ్లో నటిస్తూ మంచి క్రేజ్ ను అందుకున్న ముద్దుగుమ్మ అంటే గుర్తొచ్చేది నయనతార.. చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో నయన్ ముందు వరుసలో వుంటుంది.. సినిమాలకు డిమాండ్ ఎక్కువే సినిమాలు ఎక్కువనే చెప్పాలి.. మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్న నయన్ వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.. అయితే నయన్ తన అసిస్టెంట్స్ సాలరిని ఓ నిర్మాత బయట పెట్టాడు.. వివరాల్లోకి వెళితే..

 

 

 

రజినీకాంత్, కమల్ హాసన్‌లకున్న హోదా నయనతారకు కూడా ఉంది. అయితే నయనతార కోసం సెట్స్‌లో పెట్టే ఖర్చులు అంతా ఇంతా కాదు అంటూ ప్రముఖ తమిళ నిర్మాత రాజన్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నయనతార ఏదన్నా సెట్‌కు వెళితే ఆమెతో పాటు ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉండి తీరాల్సిందేనట.

 

 

 

అంతేకాదండోయ్ ఆమెతో పాటుగా ఆరుగురు అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వారందరికీ రోజుకు ఏడు నుంచి పన్నెండు వేల వరకు జీతాలు ఇవ్వాలి. నాకు తెలిసిన వారు ఈ విషయాలు చెప్పారు. కాబట్టి వారు చెప్పేది నిజమే అయివుంటుంది. ఈ రకంగా చూసుకుంటే నయన్ అసిస్టెంట్స్‌కు రోజుకు 75 నుంచి 80 వేల రూపాయల వరకు ఇవ్వాలి. ఒకవేళ నయన్ 50 రోజుల పాటు సెట్స్‌కు వస్తే పరిస్థితేంటో ఆలోచించండి. 

 

 

 

నయన్ తో  చేయాలంటే..నిర్మాత సినిమా కోసం తెచ్చిన డబ్బును నయనతార అసిస్టెంట్స్ పైనే ఖర్చు అయిపోతుంది. దీనికి తోడు నయనతార డ్రైవర్స్‌కి, డీజిల్ ఖర్చులు ఎంత ఉంటాయో ఆలోచించండి.. మరో విషయమేంటంటే..నయన్ కోసం వాడే క్యారీవ్యన్ల ఖరీదు కూడా ఎక్కువనే చెప్పాలి..దాదాపుగా కోటికి పైగా ఉంటుందని సమాచారం..నిర్మాత ఒక్క రోజు కారవ్యాన్‌కే లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాలి. ఎంజీఆర్, శివాజీ గణేశణ్‌లు అయితే అసలు ఎప్పుడూ కారవ్యాన్‌ను వాడలేదు. షూటింగ్‌కి వాళ్ల వాహనాల్లోనే వచ్చేవారు’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు...అయితే నయన్ లక్కీ లెగ్ కారణంగా అమెను దర్శక నిర్మాతలు బరిస్తున్నారు.. దేనికైనా పేట్టి పుట్టలిగా.. మొత్తానికి నయన్ కు ఉన్న క్రేజ్ చిత్ర పరిశ్రమలో ఎవరికీ లేదని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: