లావణ్య త్రిపాఠి.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. లావణ్య అనే పేరుకి సరిగ్గా సరిపోయే రూపం లావణ్య త్రిపాఠిది. ఉత్తరాది నుంచి వచ్చిన ఈ భామ నటన పరంగా .. గ్లామర్ పరంగా మంచి పేరు వుంది. ఎక్కువ సంఖ్య‌లో సినిమాలు చేయా‌ల‌న్న హ‌డావిడి త‌గ్గించుకుని ప‌ద్ధ‌తిగా క‌థ‌ల్ని ఎంచుకుంటోంది లావ‌ణ్య త్రిపాఠి. ఈ క్ర‌మంలోనే ఒక్కో సినిమాను ఒప్పుకుంటూ, తనని తాను నిరూపించుకుంటూ వెళుతోంది. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన సొట్టబుగ్గల సుందరి లావణ్య.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది.

IHG

అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఇంత వరకూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయింది. అలాగని చెప్పుకోదగ్గ సినిమాల్లో చేయలేదా అంటే.. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, అర్జున్ సురవరం వంటి మంచి చిత్రాలతో ఆడియన్స్‌కి బాగానే ద‌గ్గ‌రైంది. కాని, అమ్మ‌డుకు అదృష్టం క‌లిసిరాలేదు. వాస్త‌వానికి లావణ్య మొదటి నుంచి ఇతర కమర్షియల్ హీరోయిన్లతో పోలిస్తే కొంచెం భిన్నం అనే చెప్పాలి. నిజానికి ముంబై హీరోయిన్లు స్కిన్ షో‌కు పెద్దగా వెనుకాడరు. 

IHG

కానీ సినిమాలో తన పాత్రకు ఎంతో కొంత ప్రాముఖ్యత ఉంటేనే లావణ్య అంగీకరిస్తూ వస్తుంది. దీంతో ఈ బ్యూటి పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే ఆ ఇమేజ్ తన పాలిట శాపమై పోయిందని గ్లామర్ రోల్స్ రావడం లేదని, అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు, చిత్రాలు వస్తున్నాయని దాంతో సక్సెస్ పరంగా వెనుకబడి పోయానని బాధపడుతోంది. సూపర్ హిట్స్ తనకు లభించినా పెద్ద సినిమాల్లో ఛాన్స్ లు రాకపోవడానికి.. ఎక్స్ పోజింగ్ కి ఇన్నాళ్లు దూరంగా ఉండటమే అంటోంది. ఈ క్ర‌మంలోనే ఇక ముందు దూసుకుపోవాలని అనుకుంటుందట లావణ్య. కాగా, ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో ఒక సినిమా చేస్తుంది. ఇక ఇప్పుడు క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా లావణ్య ఇంట్లోనే ఉంటూ.. ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: