సినీ పరిశ్రమలో  చాలా మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి తమ హవా నడిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి కొంతమంది అందాల ఆరబోత చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తూ ఉంటే ఇంకొంత మంది మాత్రం తమ నటన అభినయం తోనే దర్శకనిర్మాతలు ఆకర్షిస్తూ ఉంటారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదా సీదా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని ఎక్కడ అందాల ఆరబోత చేయకుండా... తాను నటించే పాత్ర లో ఎక్కడా వల్గారిటీ లేకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నయనతార. తెలుగు చిత్ర పరిశ్రమలో నయనతారకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసింది. 

 


 ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తూ.. తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.... విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది నయనతార. తెలుగు చిత్ర పరిశ్రమలో నయనతార దాదాపుగా దశాబ్దకాలంపాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా నయనతార స్టార్ హీరోయిన్ రేంజ్ లోనే కొనసాగుతోంది. ఎంత మంది కుర్ర హీరోయిన్లు వచ్చినప్పటికీ... నయనతార క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. నయనతార పాత్రలు ఆమె కోసం వేచి చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో రక్తి కట్టిస్తుంది నయనతార. 

 

 

 అందుకే తమ సినిమాలలో నయనతారని తీసుకోవడానికి అటు దర్శకనిర్మాతలు కూడా బాగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా అందాల ఆరబోత మాత్రం చేయలేదు. నయనతార వేషధారణ సాంప్రదాయానికి నిలువుటద్దంలా ఉంటుంది. అందుకే తెలుగు ప్రేక్షకులు మరింతగా నయనతారకు ఆకర్షితులయ్యారు. తన చిలిపి నవ్వుతోనే ఎంత మంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని కొన్ని సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక గత ఏడాది ఈ మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: