తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి అందాల ఆరబోత చేయకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి.. కేవలం అభినయం తోనే తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన హీరోయిన్లలో ఒకరు త్రిష. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా త్రిష ఎంతటి హవా నడిచిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సినిమాల నుంచి సీనియర్ హీరోల సినిమాల వరకు అన్ని సినిమాల్లో తన అభినయంతో ఆకట్టుకుంది త్రిష. అయితే అక్కడ అక్కడ రెండు మూడు సినిమాల్లో అందాల ఆరబోత చేసినప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం ఏ సినిమాలో కూడా అందాల ఆరబోతకు అంతలా మొగ్గు చూపలేదు త్రిష . మొదటినుంచి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ వచ్చింది. 

 


 దాదాపుగా అందరు హీరోలతో సినిమాలు చేసి  ఎన్నో సంచలన విషయాలను కూడా తన ఖాతాలో వేసుకుంది త్రిష . కానీ ఏ సినిమాలో మాత్రం అందాల ఆరబోతతో ప్రేక్షకుల్లో హిట్ పుట్టించలేదు . కేవలం వైవిధ్యమైన పాత్రలను చేసుకుంటూ తన నటనతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ... అందాల ఆరబోత వైపు మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు త్రిష . దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలానికి పైగా హావా అనిపించింది. ఈ దశాబ్దకాలంలో త్రిష హీరోయిన్ గా నటించిన సినిమాలు ఎన్నో.. అందుకున్న విజయాలు మరెన్నో . దశాబ్దకాలంపాటు ఏ హీరోయిన్ కు సాధ్యం కానీ క్రేజ్ ని సంపాదించింది త్రిష. 

 


 అదేంటోగాని అందాల ఆరబోత చేయకుండానే వరుస  అవకాశాలను చేజిక్కించుకుంది త్రిష . అప్పట్లోనే అందాల ఆరబోత చేయకుండా అప్పటికి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది అని నిరూపించింది త్రిష. ఇక ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా దృష్టి పెట్టిన త్రిష అక్కడ వరుస అవకాశాలు చేజిక్కించుకుంది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపిస్తుంది . ఇక ఈ మధ్య కాలంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో  మళ్లీ తెలుగు తెరపై కనిపించాలని ప్రయత్నించినప్పటికీ ఎందుకో  కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆ సినిమా నుంచి తప్పుకుంది త్రిష. అటు తమిళ ఇండస్ట్రీలో మాత్రం మంచి అవకాశాలను దక్కించుకుంటుంది.  మరి మళ్లీ తెలుగులోకి ఎప్పుడు వచ్చి తెలుగు ప్రేక్షకులను  అలరిస్తుంది అనేది  మాత్రం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: