తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ చాలా తక్కువమంది హీరోయిన్లు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతు  వుంటారు. ఇలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్ లలో  ఒకరు అనుపమ పరమేశ్వరన్. ముఖ్యంగా యూత్ కి అందాల దేవత గా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రతి సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. ముఖ్యంగా తన అభినయంతో యూత్ అందరికీ మతిపోగొట్టేసింది అనే చెప్పాలి. 

 


 అయితే అనుపమ పరమేశ్వరన్ స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు మంచి అవకాశాలు దక్కించుకుంది. వరుస అవకాశాలను చేజిక్కించుకుంది కానీ ఎక్కడా అందాల ఆరబోతకు మాత్రం తావు ఇవ్వలేదు. కేవలం సాంప్రదాయమైన వస్త్రధారణ లోని సినిమాల్లో  ఆకట్టుకుంది అనుపమ పరమేశ్వరన్. చాలానే సినిమాలు చేసినప్పటికీ ఏ సినిమాలో కూడా ఎక్కడా అందాల ఆరబోత చేసిన దాఖలాలు మాత్రం లేవు. ఎప్పుడు చీరకట్టులో సాంప్రదాయమైన వస్త్రధారణ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. కేవలం తన చిలిపి నవ్వుతోనే ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. 

 


 అయితే అఆ  సినిమా తర్వాత ఈ అమ్మడు వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నప్పటికీ ఈ అమ్మడు చేసిన సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ... ఈ అమ్మడికి మరిన్ని అవకాశాలు మాత్రం రాలేకపోయాయి. అందం అభినయం టాలెంట్ అన్నీ ఉన్నప్పటికీ ఎందుకో  అదృష్టం కలిసి రాలేదు అనుపమ పరమేశ్వరన్ కి. దీంతో గత కొంత కాలం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కడా కనిపించలేదు. కెరీర్ మొదట్లో వరుస అవకాశాలు దక్కించుకుంది కానీ.. ఏ సినిమా కూడా తనకు అంతగా కలిసి రాలేదు. ఎంత క్రేజ్ వుంటే మాత్రం ఏం లాభం అదృష్టం కలిసి రానప్పుడు. సినిమా ఇండస్ట్రీ అంటే ఓవైపు టాలెంట్ అందంతో పాటు అదృష్టం కూడా ఉండాల్సిందే లేకపోతే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగడం కష్టమే  మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: