మామూలుగా అయితే చిత్ర పరిశ్రమలో  ఏ హీరోయిన్ వచ్చిన ఎదగటానికి స్క్రీన్ షో  మాత్రం చేయాల్సిందే అని ఒక వాదన బలంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ నేటి తరం హీరోయిన్లు మాత్రం అది నిజం కాదు అని నిరూపిస్తున్నారు. అయితే నేటి తరంలో కూడా అందాలు ఆరబోసి స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న వారు కూడా లేకపోలేదు. అందాల ఆరబోతతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన హీరోయిన్లు కొంతమంది అయితే.... అందాల ఆరబోత జోలికి వెళ్లకుండా స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన వాళ్ళు ఇంకొంతమంది. నేటి తరం హీరోయిన్లలో చాలామంది అందాల ఆరబోతకు దూరంగానే ఉంటున్నారు. ఇలా అందాల ఆరబోతకు మొదటి నుంచి దూరంగా ఉండి కేవలం తన అందం అభినయంతో మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగిన హీరోయిన్ రష్మిక మందన. 

 


 తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ హీరోయిన్ కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ రష్మిక మాత్రం అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్లలో ఒకరుగా  నిలిచింది. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి విజయాలను  తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది  రష్మిక మందన. తన కొంటే చూపుతో  ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించింది.  చలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ఎక్కడ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకోవడానికి మాత్రం అస్సలు అంగీకరించలేదు రష్మిక మందన. సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఉండే వేషధారణతో ఎంతో మందిని ఆకర్షించింది రష్మిక మందన. 

 


 మొదటి సినిమా నుంచే ఎక్కడ అందాల ఆరబోతకు మాత్రం తావివ్వలేదు . కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ  పోయింది. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రష్మిక మందన ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ తో  నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా చిన్న సినిమాగా విడుదలై ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ జోడీగా డియర్ కామ్రేడ్ సినిమా లో నటించింది. ఈ సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ రష్మిక కు మాత్రం నటన పరంగా మంచి మార్కులే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది సరిలేరు నీకెవ్వరు సినిమాలో హి సో క్యూట్ అంటు స్టార్  హీరోయిన్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: