సినిమా వాళ్ల‌కు రాజ‌కీయాల‌కు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమా వాళ్లు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎలా సక్సెస్ అయ్యారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు హాట్ యాంక‌ర్ అన‌సూయ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. చ‌ర్చు ప్రారంభ‌మ‌య్యాయి. జ‌బ‌ర్ద‌స్త్ షో తో సూప‌ర్ పాపుల‌ర్ అయిన అన‌సూయ ఆ త‌ర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఇక్క‌డ కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించు కుంది. 

 

ముఖ్యంగా అన‌సూయ ఎన్ని సినిమాలు చేసినా కూడా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ నటించిన రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త పాత్ర‌తో ఆమెకు తిరుగులేని పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాత అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన సినిమాల్లో కూడా ఆమెకు అనుకున్నంత పేరు అయితే రాలేదు. ఇక అన‌సూయ ఇప్పుడు మ‌రో కొత్త రోల్లోకి ఎంట్రీ ఇస్తున్న‌ట్టు స‌మాచారం. అన‌సూయ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంద‌ట‌. ఆమె త‌న దృష్టి అంతా రాజ‌కీయాల్లోకి మళ్లించ బోతోంద‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు కూడా ఆఫ్ ద రికార్డుగా చెపుతున్నాయి.

 

ఇప్ప‌టికే అధికారంలో ఉన్న పార్టీలు ఆమెను త‌మ పార్టీలో చేరాల‌ని ఒత్తిడి కూడా చేస్తున్న‌ట్టు స‌మాచారం. అన‌సూయ త‌మ పార్టీలో ఉంటే త‌మ పార్టీకి గ్లామ‌ర్ హంగులు ఉన్న‌ట్టు ఉంటుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నార‌ట‌. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు టీడీపీలో ప‌లువురు సినిమా వాళ్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు అన‌సూయ‌పై కూడా ఇదే త‌ర‌హాలో ఒత్తిళ్లు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే పలు  రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఆమెను అడిగినట్టు సమాచారం. 

 

అన‌సూయ ఏ పార్టీలో చేరాలి ?  ఎలా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల‌ని ఆమె ఊగిస‌లాట లో ఉండ‌గా.. ఆమె స‌న్నిహితులు మాత్రం ఇప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌ద్ద‌ని చెపుతున్నార‌ట‌. ఏదేమైనా అన‌సూయ రేపో మాపో పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందా  అని అంద‌రూ ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. అయితే ఆమె జాతీయ స్థాయి పార్టీలో చేరేందుకు ఆస‌క్తితో ఉంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: