ఇండస్ట్రీలో అతి తక్కువ మందితో స్నేహం చేస్తాడని పవన్ కల్యాణ్ కు పేరు ఉంది. నిజంగానే పవన్ కూడా అదే మెయింటైన్ చేస్తూంటాడు. ఇదే విషయాన్ని పవన్ కూడా చాలాసార్లు చెప్పాడు. అలా.. తనకు దగ్గరైన వ్యక్తుల్లో కమెడియన్ అండ్ హీరో ఆలీ ఒకరు. బాల నటుడి నుంచి ఇప్పటివరకూ ఆలీ టాలీవుడ్ లో టాప్ యాక్టర్. అలాంటి ఆలీ అంటే పవన్ కు చాలా ఇష్టం. ప్రతి ఏటా వేసవిలో పవన్ తోట నుంచి మామిడి పండ్లు వెళ్తూంటాయి. మరి.. ఈసారి వెళ్లాయా అనే విషయంపై ఆలీమీడియా చానెల్ లో స్పందించారు.

IHG's Doctorate celebrations | Attarintiki ...

పవన్ తో నా ప్రయాణం దాదాపు రెండు దశాబ్దాల నుంచీ కొనసాగుతోంది. తొలిప్రేమ నుంచి దాదాపుగా ఏ సినిమా కూడా నేను ఆయన సినిమాలో మిస్సవ లేదు. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ప్రతి ఏటా వేసవిలో ఆయన నుంచి మామిడి పళ్లు వచ్చేవి. సేంద్రీయ పద్ధతిలో పండించే ఆ పళ్లు చాలా మధురంగా ఉంటాయి. ఈసారి రాలేదు. రాజకీయాలే ఇందుకు కారణమయ్యాయి. మరి.. వచ్చే ఏడాది వస్తాయేమో చూడాలి అంటూ పవన్ తో స్నేహం గురించి చెప్పుకొచ్చాడు. పవన్ ఆలీ మధ్య రాజకీయ వైరం చాలామందిని ఆశ్చర్యపరిచింది కూడా.

IHG

అయితే.. ఆలీ తన మాటల్లో పవన్ నుంచి వచ్చే ఏడాది మామిడి పళ్లు వస్తాయేమోఅనటం చర్చనీయాంశమైంది. మళ్లీ వీరిద్దరి స్నేహం చిగురిస్తుందేమో అన్న ఆశలు అభిమానుల్లో వస్తున్నాయి. వీరిద్దరూ కలిస్తే ఆ సందడే వేరు కదా. ఆలీ తన మాటల్లో.. చిరంజీవి ఇంటి నుంచి కూడా ప్రతి ఏటా ఆవకాయ వస్తుందని కూడా చెప్పుకొచ్చాడు. తన మాటలతో మొత్తానికి చిరంజీవి ఫ్యామిలీతో తన అనుబంధాన్ని ఆలీ గుర్తు చేసుకున్నాడనే చెప్పాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: