ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలంటే కచ్చితంగా డైరెక్టర్లు మరియు నిర్మాతల కోరికలు తీర్చాలని చాలామంది ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లే కామెంట్ చేయడం మనం చూశాం. తాజాగా ఇటీవల ఇలాంటి వేధింపులు ఎదుర్కొని ఇండస్ట్రీలో ఒక మంచి నటి తనని తాను అమ్ముకోలేక ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె మరెవరో కాదు తమిళ ఇండస్ట్రీకి చెందిన కళ్యాణి. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చిందో అనేక విషయాల గురించి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న టైంలో పలువురు టాప్ డైరెక్టర్లు మరియు నిర్మాతల నుండి భయంకరమైన లైంగిక వేధింపులు ఎదురుకావడంతో చిత్ర పరిశ్రమకు దూరమయ్యానని నటి కళ్యాణి తెలిపారు.

IHG' reveals Kalyani ...

ఇంటికి వెళ్ళిన అర్ధరాత్రులు వారి నుండి ఫోన్ రావడం కుటుంబ సభ్యులు మధ్య కూడా కనీసం ప్రశాంతంగా బ్రతకలేని రోజులు చిత్ర పరిశ్రమలో ఉన్నప్పుడు చూశాను అని నటి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగులో కూడా నటించిన ఈమె ఎక్కువగా తమిళ్ లో పలు సినిమాలు మరియు సీరియల్స్ లో నటించడం జరిగింది. ఇంకా అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో స్టార్టింగ్ రోజుల్లోనే  ప్ర‌భుదేవాతో క‌లిసి 'అలై తండా వాన‌మ్' చిత్రంలో న‌టించాన‌న్నారు. దీంతో  హీరోయిన్‌గా మంచి అవ‌కాశాలు రావ‌డం స్టార్ట్ అయ్యాయ‌న్నారు. ఇదే త‌రుణంలో కొంత మంది వ్య‌క్తుల నుంచి త‌న త‌ల్లికి  ఫోన్లు వ‌చ్చాయన్నారు. తమ కోరికలు తీర్చాలని ఏకంగా తన తల్లికి ఫోన్ లు రావటంతో ఉన్న కొద్దీ లైంగిక వేధింపులు ఎక్కువవడంతో ఇండస్ట్రీ కి దూరమయ్యాను అన్నారు.

IHG

ఆ తర్వాత సీరియల్స్ లో అడుగుపెట్టిన అక్కడ కూడా మృగాలు ఉండటంతో లైంగిక వేధింపులు ఉండటంతో ఇండస్ట్రీ మీద అసహ్యం వేసి నటనకు దూరమైనట్లు కళ్యాణి వెల్లడించారు. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది నెటిజన్లు కామెంట్ బాక్స్ లో వెండితెరపై కనబడాలంటే హీరోయిన్ల పరిస్థితి ఈ విధంగా ఉంటుందా అని షాక్ అవుతున్నారు. మరికొంతమంది ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్లు గా రాణిస్తున్న వారు అంతా కాంప్రమైస్ అయిపోయారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: