తెలుగు నుండి మరో పాన్ ఇండియా సినిమా రూపుదిద్దుకోనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంకు చెందిన ప్రముఖ మహిళా వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ పథక విజేత కరణం మల్లీశ్వరి జీవితం వెండితెరపైకి రానుంది. ఇందుకోసం తెలుగు లో టాప్ రైటర్ గా కొనసాగుతున్న కోన వెంకట్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈరోజు కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు సందర్భంగా  ఈచిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.  
తెలుగు తోపాటు హిందీ ,తమిళ భాషల్లో రానున్న ఈచిత్రాన్ని రాజుగాడు తో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చిన సంజనా రెడ్డి  డైరెక్ట్ చేయనుంది అయితే మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈపాత్ర కోసం భూమి పడ్నేకర్ అనుకున్నారు కానీ పాన్ ఇండియా సినిమా కావడంతో స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటున్నారట దాంతో అన్ని భాషల్లో సుపరిచితమైన ఓ టాప్  హీరోయిన్ ను ఈపాత్ర చేయనుంది. త్వరలోనే ఈవిషయంలో క్లారిటీ రానుంది. ఎంవీవీ సత్యనారాయణ ,కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇక ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మూడు స్వర్ణపతకాలు, 2000 ఒలింపిక్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్యాన్ని సాధించి, ఒలింపిక్ పతకం సాధించిన మొదటి భారతమహిళ,మూడో భారత వ్యక్తిగా కరణం మల్లీశ్వరి రికార్డు సృష్టించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: