ప్రపంచ స్థాయి సినీ రంగంలో పెను మార్పులు తీసుకున్న వచ్చిన దర్శకులు జేమ్స్‌ కామెరూన్‌.  ఆయన తెరకెక్కించిన జురాసిక్ పార్క్ తో సీనీ ప్రపంచానికి ఓ కొత్త ఆవిష్కరణ సృష్టింపబడింది.  అసలు మన కళ్ల ముందు  అసలు నిజమైన జంతువులు తిరుగుతున్నాయా అన్న బ్రమ కలిగే విధంగా సనిమా తెరకెక్కించారు. ఆ తర్వాత అవతార్ సినిమతో మరో సెన్సేషన్ సృష్టించారు.. నిజంగా ఓ సరికొత్త ప్రపంచానికి తీసుకు వెళ్లారు.  ఇలా జేమ్స్‌ కామెరూన్‌ ఏది చేసినా అత్యాదునిక టెక్నాలజీతో అద్భుతమైన కొత్తదనం సృష్టిస్తుంటారు. 42 ఏండ్ల క్రితం జెనోజెనెసిస్‌ సినిమాతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కెనడియన్‌ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, స్క్రీన్‌రైటర్‌  ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు కామెరూన్.

 

 11 సినిమాలు ఆయన స్వీయ దర్శకత్వంలోనే వెలువడి సంచలనం సృష్టించాయి. 1984 లో ది టర్మినేటర్‌ సినిమాతో తనకంటూ హాలీవుడ్‌లో ఒక గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత రాంబో, ఏలియన్స్‌, టైటానిక్‌, అవతార్‌ వంటి ఎన్నో సైన్స్‌ ఫిక్షన్ సినిమాలు జనాల్లో ఓ కొత్త ట్రెండ్ సృష్టించబడ్డాయి. జేమ్స్‌ కామెరూన్‌ నిర్మించిన సినిమాలన్నింటిలో 'అవతార్‌' సినిమా కొత్త ట్రెండ్‌ను సెట్‌ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు సీక్వెల్‌లు తీస్తానని కామెరూన్‌ ఏనాడో ప్రకటించారు. దానికి తగినంత వర్కవుట్‌ కూడా చేశారు. స్క్నీన్‌ప్లే పుస్తకాలను సినిమాలో నటిస్తున్నవారికి, సాంకేతిక నిపుణులకు కూడా అందించారు. సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు 50 మంది క్రూతో కలిసి ప్రత్యేక చార్టర్డ్‌ విమానంలో జేమ్స్‌ కామెరూన్‌ న్యూజీలాండ్ చేరుకొన్నారు.

 

వెల్లింగ్టన్‌ చేరుకోగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం జేమ్స్‌ కామెరూన్‌తోపాటు క్రూ అందరూ 14 రోజుల సెల్ఫ్‌ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారని నిర్మాత జోన్‌ లాండౌ తెలిపారు. అవతార్‌-2 సినిమాను 2021 డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్టు ఇదివరకే జేమ్స్‌ కామెరూన్‌ ప్రకటించారు. తొలి అవతార్‌ సినిమా విడుదలైన 12 ఏండ్లకు సీక్వెల్‌ వస్తుండటం విశేషం. అవతార్‌-2తో సీక్వెల్‌ ప్రయాణాన్ని ముగించకుండా అవతార్‌-3, అవతార్‌-4 సినిమాలు కూడా నిర్మించాలని ఎప్పుడో నిర్ణయించుకొన్నట్టు వెల్లడించారు జేమ్స్‌ కామెరూన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: