హృదయంలో ఎడమభాగం ఇష్టమా కుడిభాగం ఇష్టమా లాంటి దిక్కుమాలిన ప్రశ్నలు అడిగితే ఎవరైనా తీవ్రంగా విసుక్కుంటారు. కానీ సెలబ్రిటీలు మాత్రం తమ రోజువారీ జీవితం లో ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదుర్కొంటారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా నెటిజనుల ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చారు. అయితే అతనికి కూడా కొన్ని దుష్టతంట ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ప్రశ్న అందరి అసహనానికి కారణమవుతుంది. 

IHG's Brand Value Skyrocketing
2000 సంవత్సరంలో ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యేలోపు వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ళ పాటు ఇరువురు డేటింగ్ చేసుకున్న తర్వాత 2005వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఒక సంవత్సరం తర్వాత అనగా 2006లో ఈ ముచ్చటైన జంటకు గౌతమ్ కృష్ణ జన్మించాడు. మళ్ళీ ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత అనగా 2012 సంవత్సరంలో మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంపతులకు సితార జన్మించింది. గతంలో తన పిల్లలతో ఎక్కువ సమయం గడపని మహేష్ బాబు... ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో తన జీవితాన్ని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. 


మే 31 వ తేదీన ఆస్క్ మీ ఎనీ థింగ్( నన్ను ఏదైనా అడగండి) అనే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించిన మహేష్ బాబుని ఒక నెటిజన్... సితార,గౌతమ్ కృష్ణ లలో మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? అని అడిగాడు. దానికి సమాధానం చెబుతూ... సితార, గౌతమ్ కృష్ణ ఇద్దరూ నాలోని బాగా భాగమే. ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా ఎలా లవ్ చేయగలను? అని తాను సమాధానమిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: