సినిమా అంటేనే వినోదంతో పాటు శ్రుంగారం కూడా ఉంటుంది. సగటు మనిషి తన జీవితంలో చేయలేని సాహసాలతో పాటు, రియల్ లైఫ్ లో జరగని జీవిత మాధుర్యాలను కూడా సినిమా నుంచి వెతుక్కుంటాడు. ఇక ఉప్పు లేని కూర ఎలాగో అదే మాదిరిగా చప్పగా ఉంటుంది శ్రుంగారం లేని జీవితం. సినిమాలకు కూడా అదే సూత్రం వర్తిస్తుంది.

 

సినిమాలో పాటలు అందుకే పుట్టాయి. సినిమాల్లో చాలా మంది ఇష్టపడే సన్నివేశాలు కూడా అవే. వాటిని అందంగా కధ మధ్యలో చేరుతూ సినిమాను పూర్తి చేయడమే ప్రతిభావంతులైన డైరెక్టర్ టార్గెట్. మరి అలాంటిది సినిమాల్లో  ముద్దులు వద్దు, మురిపాలు వద్దు అంటూ  కండిషన్లు పెడితే అది సాధ్యమేనా.

 

అలా జరుగుతుందా అని కూడా డౌట్లు వస్తాయి. కానీ సినిమా షూటింగులకు తొలిసారిగా అనుమతి ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముద్దులు, కౌగిలింతలు కట్ అంటూ కఠినమైన నిబంధనే విధించింది. అలాగే సినిమాలకు  ఆరోప్రాణమైన ఫైటింగులు కూడా వద్దు అనేసింది. ఇక పెళ్ళిళ్ళు కూడా సినిమాల్లో ఉండరాదుట.

 

అదే విధంగా సినిమాల్లో  రద్దీలు, జాతరలు, మార్కెట్ సీన్లు కూడా ఉండవద్దని కండిషన్లో కచ్చితంగా పేర్కొన్నారు. ఈ విధంగా పాటిస్తేనే షూటింగులకు అనుమతి అని కూడా అంటోంది. అలాగే తక్కువ మందితో మాత్రమే షూటింగులు జరుపుకోవాలని, ఎవరి మేకప్ వారే వేసుకుని సెట్స్ కి రావాలని కూడా పేర్కొంది.

 

ఇక కేరళ సర్కార్ కూడా యాభై మంది దాక మాత్రమే షూటింగు చేసుకునేందుకు అనుమతిస్తామని చెప్పింది. అది కూడా ఇండోర్ లోనే అని కూడా చెప్పింది. రేపో మాపో ఏపీ, తెలంగాణా  సర్కార్లు కూడా ఇదే విధమైన నిబంధనలు విధించే అవకాశాలు ఉన్నాయి. షూటింగులకు ఇలా అనుమతించడం కరోనా మహమ్మారిని ద్రుష్టిలో పెట్టుకుంటే ఒకే కానీ నిజానికి అలా చేస్తే సినిమా అవుతుందా. ఆ సినిమాకు ఆదరణ లభిస్తుందా అన్నది ఇపుడు పెద్ద ప్రశ్న.

 

మరింత సమాచారం తెలుసుకోండి: