వరస పరాజయాల తరువాత యంగ్ హీరో నిఖిల్ ఇటీవల అర్జున్ సురవరం తో వచ్చి హిట్ కొట్టాడు. అసలు ఈచిత్రం విడుదలవుతుందో లేదో అనుకుంటే ఎట్టకేలకు విడుదలై నిఖిల్ కు సక్సెస్ ను అందించింది. ఈ సినిమా తరువాత నిఖిల్ ,చందూ మొండేటి డైరెక్షన్ లో కార్తికేయ 2లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో  తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్  'కార్తికేయ' 2014లో విడుదలై  సూపర్ హిట్ అయ్యింది అయితే కార్తికేయ 2 మాత్రం ఆ చిత్రానికి సీక్వెల్ కాదని చిత్ర బృందం ప్రకటించింది. ఇక కార్తికేయ లో మెడికల్ విద్యార్ధి గా కనిపించిన నిఖిల్, కార్తికేయ 2లో డాక్టర్ గా నటించనున్నాడు అంతేకాదు ఈసినిమా లో అతను సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడు. 
 
కుంభమేళా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా గా విడుదలకానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఫై టిజి విశ్వప్రసాద్ , వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈరోజు నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్ తో నిఖిల్ కు శుభాకాంక్షలు తెలియజేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: