మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆచార్య'. దేవదాయ ధర్మదాయ శాఖలో జరుగుతున్న అవినీతి కి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఇక ఈ సినిమా వాస్తవంగా అయితే ఈ పాటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కాని అనివార్య కారణాల వల్ల షూటింగు ఆలస్యం కావడం.. గత రెండు నెలలుగా కరోనా కారణంగా షూటింగ్స్ అన్ని పూర్తిగా ఆగిపోవడంతో ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి  విడుదల చేస్తారని అన్నారు.

 

అయితే తాజా పరిణామాలు చూస్తుంటే 2021 సంక్రాంతికి కూడా రిలీజ్ అయ్యో సూచనలు కనిపించడం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకూ 40 శాతమే పూర్తయిందని సమాచారం. ఇక ఇప్పటి నుంచి జరపాల్సిన టాకీ పార్ట్ లో రామ్ చరణ్ కి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఉంది. ఇక ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 'ఆచార్య' షూటింగ్ 'ఆర్ ఆర్ ఆర్ పై ఆధారపడి ఉందని. 'ఆర్ ఆర్ ఆర్ ' పూర్తైన తర్వాతే చరణ్ 'ఆచార్య' షూటింగు లో జాయిన్ కావాలని రాజమౌళి కండిషన్ పెట్టినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. 

 

అయితే కొరటాల రాజమౌళి మాట్లాడుకొని కొన్ని డేట్స్ 'ఆచార్య' కోసం ఎడ్జెస్ట్ చేశారట. కాని ఇప్పుడు లాక్ డౌన్ తో అవన్ని తారుమారయ్యాయి. ఇక ఆర్.ఆర్.ఆర్ కూడా అన్ని సినిమాల మాదిరిగా డిలే కావడంతో ఆ ప్రభావం 'ఆచార్య' పై పడుతోందని చెప్పుకుంటున్నారు. దీంతో రామ్ చరణ్ ఎప్పుడు 'ఆచార్య' షూటింగ్ లో జాయిన్ అవుతాడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇవన్ని ఆలోచించి 2021 సంక్రాంతికి 'ఆచార్య' రిలీజ్ కావడం కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. 

 

ఇక ఏ సినిమాకైనా సంక్రాంతి తర్వాత మళ్ళీ అలాంటి పర్ఫెక్ట్ సీజన్ సమ్మర్. అయితే ఆర్.ఆర్.ఆర్ ముందు అనుకున్నట్టుగా జనవరి 8 న రిలీజ్ కావడం కష్టమే. దాంతో ఇక సమ్మర్ కే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఇదే గనక జరిగితే మళ్ళీ 'ఆచార్య' సమ్మర్ సీజన్ లో రిలీజ్ చేయడం సాధ్యపడే విషయం కాదని అంటున్నారు.  మొత్తానికి ఈ రెండు సినిమాల విషయం లో మేకర్స్ తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం జరుగుతుందో ఈ సినిమాల రిలీజ్ విషయంలో ఎప్పుడు క్లారిటి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: