అందాల గాయని సునీత ఎట్టకేలకు తన గ్లామర్ సీక్రెట్ చెప్పేసింది. అందం, అందమైన గాత్రం కలబోతగా నిలిచే గాయని సునీత.. మధురమైన గాత్రంతోనే కాదు.. చూపుతిప్పుకోలేని అందంతోనూ బాగా ఫేమస్ అయ్యారు. ఇలా అందం, గాత్రం రెండూ చక్కగా కుదిరిన గాయనులు చాలా అరుదు. అందుకే అంతా ఆమెను ఎలా ఇంత బాగా మెయింటైనే చేస్తున్నావ్ అని అడుగుతుంటారు.

 

IHG

సింగర్ సునీత గొంతు విన్నా.. ఆమెను చూసినా.. ఆమె వయస్సును అంచనా వేయడం కష్టం. సినీహీరోయిన్ కు దీటుగా కనిపించే ఈ గ్లామర్ సింగర్ కు డిగ్రీ చదివే కొడుకూ.. నైంత్ క్లాస్ చదివే కూతురూ ఉందంటే నమ్మడం కష్టమే. ఆమె తన కొడుకూ కూతుళ్లతో దిగిన ఫోటోలు చూస్తే ముగ్గురూ ఒక తల్లి పిల్లలు అనుకుంటారు తప్ప.. ఆ ఇద్దరు పిల్లలకూ ఈమె తల్లి అనుకోరు. అలా కనిపిస్తారు గాయని సునీత.

 

IHG

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వచ్చిన ఆమెను యాంకర్ తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పమన్నారు. అయితే ఆమె చెప్పింది విని ఆ యాంకర్ కూడా ఆశ్చర్యపోవడం విశేషం. ఎందుకంటే.. అంత స్లిమ్ గా గ్లామర్ మెయింటైన్ చేస్తున్న యాంకర్ సునీత రోజుకు నాలుగు సార్లు తింటారట. అదే తన గ్లామర్ సీక్రెట్ అంటూ నవ్వేసిందామె. ఇక ఆమె తన దినచర్య గురించి వివరిస్తూ.. ఉదయం తప్పకుండా టిఫిన్ చేస్తానని చెప్పింది.

 

IHG

మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట లోపే భోజనం కానిచ్చేస్తుందట. మళ్లీ నాలుగు, ఐదు గంటలకు స్నాక్స్ ఉండాల్సిందేనట. ఆ తరవాత రాత్రి భోజనం. అయితే వీటన్నిటిల్లోనూ ఇదే ఉండాలి అంటూ ఆమెకు పట్టింపులేమీ ఉండవట. అంతే కాదు.. ఇంత లిమిటెడ్ గానే భోంచేయాలని నియమం ఏమీ పెట్టుకోదట. కానీ తనకు మొదటి నుంచి మితంగానే తినే అలవాటు ఉందట. సో.. అలా రోజుకు నాలుగు సార్లు తినడమే నా ఆరోగ్య, సౌందర్య రహస్యమంటూ నవ్వేసింది గాయని సునీత.

 

మరింత సమాచారం తెలుసుకోండి: