ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేడు తన 76వ పుట్టిన రోజును జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మొత్తంగా తన కెరీర్ లో ఏకంగా తెలుగు సహా పలు ఇతర భాషల్లో వేయి కి పైగా సినిమాలకు ఏడు వేలకు పైగా సాంగ్స్ కంపోజ్ చేసిన సంగీత దర్శకుడిగా గొప్ప పేరు గడించారు ఇళయరాజా. అటు తమిళ్ తో పాటు అప్పట్లో తెలుగులో కూడా చాలా సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఇళయరాజా అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఇప్పటికీ కూడా ఎంతో గొప్ప పేరుంది. ఇక ఆయన హృద్యమైన సుమధురంగా ఉండే సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అని అనాలి. 

IHG

తెలుగులో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అప్పట్లో దాదాపుగా అందరు హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజాకు ప్రఖ్యాత టాలీవుడ్ దర్శకుడు వంశీ తో ఎంతో మంచి అనుబంధం ఉంది. దర్శకుడిగా తన మొదటి సినిమా మంచు పల్లకి కి రాజన్ నాగేంద్ర ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్న వంశీ, ఆ తరువాత తీసిన రెండవ సినిమా సితార కు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అప్పట్లో ఆ సినిమా తో పాటు అందులోని సాంగ్స్ కూడా ఎంతో గొప్ప విజయాన్ని అందుకుని శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక అక్కడి నుండి ప్రారంభం అయిన వంశీ, ఇళయరాజాల ప్రస్థానం ఆ తరువాత వరుసగా చాలానే సినిమాల వరకు కొనసాగింది. 

 

పలానా జానర్ అనేది లేకుండా, అప్పట్లో తాను తీసే ప్రతి సినిమాకు ఇళయరాజానే సంగీత దర్శకుడిగా కావాలని వంశీ తీసుకునేవారట. ఇక వంశీ సినిమాలు మిగతా దర్శకులతో పోలిస్తే కొంత విభిన్నమైన కథ, కథనాలు, వెరైటీ ఎంటర్టైన్మెంట్ తో సాగుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే విధంగా ఆయన కథలకు, పాత్రలకు, సందర్భాలకు తగ్గట్లుగా ఎంతో అద్భుతంగా ఇళయరాజా కూడా సంగీతాన్ని అందించేవారు. ఆ విధంగా వారిద్దారి కాంబోలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ కొట్టాయి. ఇక ఇటీవల 13 ఏళ్ల క్రితం వంశీ తీసిన అనుమానాస్పదం సినిమాకు కూడా ఇళయరాజా మంచి మ్యూజిక్ అందించారు. ఆ విధంగా ఈ ఇద్దరి కాంబో అప్పట్లో మంచి పేరు దక్కించుకుంది....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: