విశాఖలో ఇటీవల జరిగిన ఎల్.జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందిరికీ తెలిసిందే. కొన్ని గ్రామాల్లో ఉన్న వందల మందిని అస్వస్థతకు గురి చేసిన ఈ గ్యాస్ లీక్ 11 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది కూడా. ముఖ్యమంత్రి జగన్ హుటాహుటిన ఘటనా స్థలానికి తరలి వెళ్లి బాధితులను పరామర్శించి చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం తరఫున ప్రకటించడమే కాకుండా గ్యాస్ లీక్ వల్ల బాధింపపడ్డ ప్రతి ఒక్కరికి అధిక మొత్తంలో నష్టపరిహారం ప్రకటించిన విషయం కూడా తెలిసిందే.

 

IHG

 

అయితే ఎంత డబ్బులు ఇచ్చినా కూడా బాధితుల కుటుంబాలకు న్యాయం జరగదు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎల్ జి పాలిమర్స్ లో ప్రమాదం మానవ తప్పిదం మరియు నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తేల్చి చెప్పింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు విశ్రాంతి జడ్జి అయినా శేషశయన రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా వారందరూ పలువురితో చర్చించి ఎల్ జి పాలిమర్స్ లీ పర్యటించిన పిమ్మట తమ నివేదికను తయారు చేశారు.

 

IHG

 

ఇందులో షాకింగ్ విషయం ఏమిటంటే 2001వ సంవత్సరం నుండి ఆ కంపెనీ అనుమతి లేకుండా నడుస్తున్నట్లు కమిటీ పేర్కొంది. భద్రతాపరమైన చర్యలకు విషయంలో ఈ కంపెనీ యాజమాన్యం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే గ్యాస్ లీకేజీ జరిగిందని…. ఈ కంపెనీ పరిస్థితి ముందు నుంచి ఇలాగే ఉందని వారు నివేదికలో చెప్పారు. స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నివేదిక ఇవ్వడం తో ఇక ఇందుకు కారణమైన వారిని నిందితులుగా గుర్తించి కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉంది అని పలువురు చెబుతున్నారు.

 

IHG

 

దానితో పాటు ఇన్ని రోజులు అనుమతి లేకుండా నడుస్తున్న ఈ కంపెనీనే పూర్తిగా ఆ ప్రదేశం నుండి తరలించవచ్చు లేదా మరొక అవకాశం లేకుండా శాశ్వతంగా మూసివేసే అవకాశాలు ఉన్నందున.. దీంతో బాధిత కుటుంబాలకు కొంచెం ఊరట కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: