భారతీయ సినీ సంగీత చరిత్రలో లెజెండరీ మ్యూజీషియన్‌ గా పేరు తెచ్చుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా. తమిళ, తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన ఈ లెజెండరీ మ్యూజీషియన్‌ వెండితెర ను సుసంపన్నం చేయటంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే ఆయన జీవితంలో అభిమానులకు తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి. అభిమానులు ఇళయరాజాగా ఆరాధిస్తున్న ఈ ఇసై జ్ఞాని ఆ స్థాయికి చేరుకోవటం వెనుక ఎంతో కృషి ఉంది.

 

ఇళయరాజ అసలు పేరు రాజయ్య. సంగీత దర్శకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఆయన తన పేరును ఇళయరాజాగా మార్చుకున్నారు. అంతేకాదు ఇళయరాజా ఓ క్రిస్టియన్‌ కుటుంబం లో జన్మించాడు. తరువాత ఆయన హిందువుగా కన్వర్ట్ అయ్యాడు. ఆయన భగవాన్‌ రమణ మహర్షిని, తాయి ముగాబిగాయై ని ఆరాధిస్తారు. ఇటీవల ఆయన కుమారుడు యువన్‌ శంకర్‌ రాజా ఇస్లాం మతం తీసుకున్నాడు.

 

ఇళయరాజా స్వయానా ఆయన చెల్లెలు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు జీవా రాజయ్య. వారికి ఇద్దరు కుమారులు కార్తిక్‌ రాజా, యువన్‌ శంకర్ రాజా. ఆయన కుమారులు కూడా తండ్రి బాటలోనే సంగీత దర్శకులుగా గాయకులుగా సత్తా చాటారు. సంగీతం కంపోజ్ చేయటంలో ఇళయరాజాది డిఫరెంట్ స్టైల్‌ ముందే నోట్స్ రాసుకొని తరువాత మ్యూజిక్ కంపోజ్ చేసే అతి కొంది మంది సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకడు.

 

ఇండియన్ సినిమా హిస్టరీలో తొలిసారిగా ఓ సంగీత దర్శకుడికి కటౌట్ పెట్టటం అనేది ఇళయరాజా విషయంలోనే జరిగింది. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన మురట్టు కాలై సినిమాలో రిలీజ్ సమయంలో రజనీకాంత్‌ తో పాటు ఇళయరాజాకు కూడా భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: