సినిమా షూటింగ్ లను తిరిగి ప్రారంభించదానికి చిరంజీవి తన పరపతిని అంతా ఉపయోగిస్తూ తెలంగాణ ప్రభుత్వంతో రాయబారాలు చేస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దన్న పాత్రను చాల సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. చిరంజీవి రాయబారాలకు తెలంగాణ ప్రభుత్వం కూడ సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే షూటింగ్ ల ప్రారంభానికి సంబంధించిన అనుమతులు కొన్ని షరతులతో తెలంగాణ ప్రభుత్వం నుండి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి లభించే ఆస్కారం చాల స్పష్టంగా కనిపిస్తోంది.

 

దీనితో షూటింగ్ లకు రెడీ అవుతూ అన్ని సినిమా యూనిట్స్ ఎవరి పనులలో వారు బిజీగా ఉన్నారు. దీనితో ‘ఆచార్య’ యూనిట్ కూడ తన షూటింగ్ ను వెంటనే మొదలు పెట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే నిన్నటిదాకా ఈ సినిమా షూటింగ్ కు అడ్డుగా నిలిచిన కరోనా అడ్డంకులు కొంతవరకు తొలగినా ఇప్పుడు అనుకోకుండా ప్రకృతి ‘ఆచార్య’ కు అడ్డు పడుతుందా అన్న సందేహాలు చిరంజీవిని వెంటాడుతున్నట్లు టాక్.


వాస్తవానికి ‘ఆచార్య’ షూటింగ్ కు సంబంధించిన దేవాలయం సీన్స్ ను మొదట్లో ఒక దేవాలమలో తీయాలని భావించినా అది కష్టం అని భావించిన కొరటాల హైదరాబాద్ చివరిలో ఉన్న చిరంజీవికి సంబంధించిన ఒక ఖాళీ స్థలంలో ఎండోమెంట్స్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన ఒక సెట్ ను ఒక దేవాలయం రూపరేఖల నేపధ్యంలో చిరంజీవి సలహాతో కొరటాల ప్రత్యేకంగా డిజైన్ చేయించి వేయించాడని తెలుస్తోంది. ఈ సెట్ కు భారీగానే ఖర్చు పెట్టారని టాక్. మొదట్లో ఈ సినిమాకు సంబంధించిన ఈ కీలక సెట్లో అన్ని సన్నివేశాలను ఈ సమ్మర్ లో వర్షాలు రాకుండానే షూటింగ్ పూర్తి చేయాలని ముందుగా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకున్నారు.


అయితే కరోనా సమస్యలతో షూటింగ్ లు వాయిదా పడటంతో సెట్ రెడీగా ఉన్నప్పటికీ ఆ సెట్ లో షూట్ చేయలేకపోయారు. ఇప్పుడు షూటింగ్ లకు అనుమతులు వచ్చినా అనుకోని వానలు హైదరాబాద్ లో కురుస్తున్న పరిస్థితులలో ఏదైనా ఒక పెద్ద వాన కురిస్తే ఇప్పటికే రెడీగా ఉన్న ‘ఆచార్య’ సెట్ ఆ వానలకు పాడైపోతే తిరిగి ఆ సెట్ ను రిపేర్లు చేసుకోవడానికి మళ్ళీ కొన్ని రోజులు  షూటింగ్ వాయిదా పడుతుంది కాబట్టి ప్రస్తుతం కురుస్తున్న వానలు పెద్దవి అవ్వకూడదు అన్న టెన్షన్ లో చిరంజీవి కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: