పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో పెద్దగా చెప్పుకోతగ్గ సన్నిహితులు ఎవరు లేరు. దీనికితోడు పవన్ చాలామంది హీరోలు లా పార్టీలకు ఫంక్షన్స్ కు వెళుతూ అందరితోను చనువుగా ఉండడు. అయితే పవన్ కళ్యాణ్ అలీల సాన్నిహిత్యం ఓపెన్ సీక్రెట్. పవన్ నటించిన ఇంచుమించు అన్ని సినిమాలలోను ఇప్పటివరకు అలీకి మంచి పాత్రలు క్రియేట్ చేస్తూనే వచ్చారు.


అయితే గత సంవత్సరం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత పవన్ అలీల మధ్య దూరం బాగా పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో అలీ మొదట్లో ‘జనసేన’ తరఫున పోటీ చేస్తాడని అందరు భావించారు. అయితే అలీ అందరికీ షాక్ ఇస్తూ కొంతకాలం ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఆతరువాత వెంటనే బయటకు వచ్చి వైఎస్ఆర్ పార్టీలోకి జంప్ చేసి గతఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ విజయం కోసం చాల ఊళ్ళు తిరిగాడు.


ఆఎన్నికల ప్రచారంలో అలీ డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా జనసేన పార్టీని పవన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని పరోక్ష వ్యాఖ్యలు చేసాడు. దీనితో పవన్ అభిమానులు రెచ్చిపోయి అలీ పై విరుచుకు పడ్డారు. ఎన్నికలు ముగిసి సంవత్సరం కాలం గడిచిపోయిన తరువాత ఇప్పుడు అలీకి మళ్ళీ పవన్ గుర్తుకు వచ్చాడు.


ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలీ మాట్లాడుతూ తనకు ప్రతి సంవత్సరం పవన్ ఫామ్ హౌస్ నుండి మామిడి పండ్లు వచ్చేవని అయితే గత సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం కూడ పవన్ కళ్యాణ్ నుండి మామిడి పండ్లు రాలేదు అన్న విషయాన్ని పవన్ దృష్టికి తీసుకు వెళుతూ కనీసం వచ్చే సంవత్సరం అయినా పవన్ ఫామ్ హౌస్ లోని మామిడి పండ్లు తినాలని కోరికగా ఉందని మామిడి పండ్ల రాయబారం అలీ పవన్ తో చేస్తున్నాడు. దీనినిబట్టి చూస్తుంటే పవన్ కు మళ్ళీ దగ్గర కావాలని అలీ తన వంతు ప్రయత్నాలు చేస్తూ ఇలా మామిడి పండ్ల సాకుతో రాయబారాలు చేస్తున్నాడా అని అనిపించడం సహజం..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: