లెజండరీ మ్యూజీషియన్‌ ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాటలు పాడటం ప్రతీ గాయనీ గాయకుడి కల. ముఖ్యంగా ఈ జనరేషన్ సింగర్స్ అయిన ఇళయరాజా లాంటి లెజెండ్స్ మ్యూజిక్ డైరెక్షన్ ఒక్క పాటు పాడే అవకాశం వస్తే చాలు అని ఎదురుచూస్తుంటారు. అలాంటి ఇళయరాజ సంగీత దర్శకత్వంలో పాట పాడేందుకు ఓ గాయని ససేమిరా అంది. ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాట పాడనని తెగేసి చెప్పేసింది.

 

అలా ఇళయరాజా పాటను రిజెక్ట్ చేసింది సామాన్యమైన గాయని కాదు. ఎన్నో మాస్ సాంగ్స్‌కు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోసి గ్రేట్ సింగ్ ఎల్‌ ఆర్‌ ఈశ్వరీ. ఇళయరాజా కెరీర్‌ స్టార్టింగ్‌లో తన సినిమాలో ఎల్‌ ఆర్‌ ఈశ్వరితో ఓ పాటను పాడించాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆమెను సంప్రదించగా ఆమె పాట పాడనని చెప్పేసిందట. ఓ కొత్త సంగీత దర్శకుడితో కలిసి పనిచేయటం ఇష్టం లేని ఎల్ ఆర్‌ ఈశ్వరీ ఆ పాటను పాడేందుకు నిరాకరించింది.
IHG' - The Hindu

 

తరువాత ఇళయరాజా స్థాయి ఎన్నో రెట్లు పెరిగింది. ఇండియన్ మ్యూజిక్‌కు ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారారు. సినీ సంగీతంలో ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయన సినిమాలో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూడని గాయనీ గాయకులు లేరు.

 

దీంతో ఇళయరాజా ఆ పాటను మరో గాయనితో పాడించాడు. అంతేకాదు ఆ తరువాత ఇన్నేళ్ల సుధీర్ఘ కెరీర్‌లో ఆయన ఎప్పుడు ఎల్‌ ఆర్‌ ఈశ్వరీకి పాటను ఆఫర్ చేయలేదు. దాదాపు దక్షిణాదిలో ఉన్న ప్రసిద్ధ గాయకులంతా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడారు. కానీ ఎల్ ఆర్‌ ఈశ్వరీకి మాత్రం ఆ అవకాశం దక్కలేదు అందుకు కారణం ఆమె. ఇళయరాజాను తొలి నాళ్లలో తక్కువగా చూడటంతో తరువాత ఆయన ఆమెతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: